Ranveer Singh Remuneration: షేక్ అవుతున్న ఇండియన్ బాక్సాఫీస్.. ‘ధురంధర్’ కోసం రణ్‌వీర్‌ సింగ్‌ అంత తక్కువ తీసుకున్నాడా?

Ranveer Singh Remuneration: ధురంధర్ 2 చిత్రంకు రణ్‌వీర్‌ సింగ్‌ రూ.55 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది అతడి కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం అయినా.. రూ.2000 కోట్ల మార్క్‌ను తాకే సినిమాలో తక్కువే అని ఫాన్స్ అంటున్నారు.

Update: 2026-03-22 11:22 GMT

Ranveer Singh

Ranveer Singh Remuneration: బాలీవుడ్‌లో ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. కేవలం హిందీలోనే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1350+ కోట్ల వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. సీక్వెల్‌ ‘ధురంధర్: ది రివెంజ్’ కూడా అంతకు మించి వసూళ్లు రాబడుతోంది. మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.500+ కోట్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. సాంకేతిక సమస్యల కారణంగా తెలుగు, తమిళం, మలయాళంలో మొదటి రెండు రోజులు రిలీజ్ కాని విషయం తెలిసిందే. మార్చి 19, 20 తేదీల్లో కేవలం హిందీలోనే ప్రదర్శితమై.. రూ.330 కోట్లు (ప్రీమియర్స్‌ సహా) బిజినెస్‌ చేసింది.

మూడో రోజు నుంచి ప్రాంతీయ భాషలు కూడా తోడవ్వడంతో ధురంధర్ 2 రికార్డులు బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం కలెక్షన్లు రూ.2000 కోట్ల మార్క్‌ను దాటే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ భారీ విజయానికి ప్రధాన కారణంగా స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నటనే. హంజా అలీ, జస్కీరత్ సింగ్ రంగీ అనే రెండు విభిన్న పాత్రల్లో రణ్‌వీర్‌ నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే ఇంతలా రికార్డులు కొల్లగొడుతున్న ఈ ధురంధర్ చిత్రానికి హీరో ఎంత తీసుకున్నాడనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ చిత్రంకు రణ్‌వీర్‌ రూ.55 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది అతడి కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం అయినా.. రూ.2000 కోట్ల మార్క్‌ను తాకే సినిమాలో తక్కువే అని ఫాన్స్ అంటున్నారు.

ధురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా అక్షయ్ పోషించిన 'రహమాన్ డకాయిట్' పాత్రకు అద్భుత స్పందన లభిస్తోంది. వెటరన్ నటుడు సంజయ్ రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా.. మాధవన్ రూ.7.5 కోట్ల పారితోషికం పొందినట్లు తెలుస్తోంది. ఆశ్చర్యకరంగా అక్షయ్ ఖన్నా కేవలం రూ.2.5 కోట్లకే నటించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అర్జున్ రాంపాల్, సారా అర్జున్ సుమారు రూ.1 కోటి చొప్పున పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. మొత్తం రెండు భాగాల బడ్జెట్ సుమారు రూ.325 కోట్ల పరిధిలో ఉండగా.. వసూళ్ల పరంగా ఇది భారతీయ సినిమా చరిత్రలోనే మొదటి స్థానంలో నిలవనుంది.

Tags:    

Similar News