Kavya Kalyanram: ‘బలగం’ బ్యూటీతో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమాయాణం

'బలగం' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కావ్య కళ్యాణ్ రామ్, ప్రముఖ సంగీత దర్శకుడు కాలభైరవ ప్రేమలో ఉన్నారా?

Update: 2026-03-25 05:37 GMT

Kavya Kalyanram: ‘బలగం’ బ్యూటీతో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమాయాణం

Kavya Kalyanram and Kaala Bhairava: చిత్ర పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎప్పుడూ హాట్ టాపిక్కే. ముఖ్యంగా ఒక రైజింగ్ హీరోయిన్ మరియు ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ వారసుడి మధ్య సాన్నిహిత్యం ఉందంటే సోషల్ మీడియా ఊరుకుంటుందా? ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో ఒకటే చర్చ.. 'బలగం' సినిమాతో అందరి మనసు గెలుచుకున్న కావ్య కళ్యాణ్ రామ్, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి తనయుడు కాలభైరవ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారా?

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ వరకు..

'గంగోత్రి' వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన కావ్య కళ్యాణ్ రామ్, 'మసూద' , 'బలగం' సినిమాలతో హీరోయిన్‌గా తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా తెలంగాణ మట్టి వాసనతో వచ్చిన 'బలగం' సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రస్తుతం ఆమె కుంచం శంకర్ దర్శకత్వంలో టి.డి.ఆర్ సినిమాస్ బ్యానర్‌పై ఒక క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించింది. షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ భామ, ఇప్పుడు తన ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.

ఆ ఒక్క వీడియో తెచ్చిన కలకలం

గత కొంతకాలంగా కాలభైరవ , కావ్య కళ్యాణ్ రామ్ ప్రేమలో ఉన్నారంటూ ఫిలిం నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, తాజాగా ఒక ప్రైవేట్ వేడుకలో వీరిద్దరూ పాల్గొన్న దృశ్యాలు బయటకు రావడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. ఆ వేడుకలో వీరిద్దరూ ఎంతో సాన్నిహిత్యంగా మాట్లాడుకుంటూ, ఒకరి కంపెనీని ఒకరు ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.. త్వరలోనే గుడ్ న్యూస్ వింటామా? అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు.

కీరవాణి ఇంట్లో పెళ్లి బాజాలు?

కాలభైరవ కేవలం కీరవాణి తనయుడిగానే కాకుండా, తనదైన సింగింగ్‌తో మరియు మ్యూజిక్ డైరెక్షన్‌తో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు కావడంతో కావ్యకు కాలభైరవతో పరిచయం ఏర్పడిందని, అది కాస్తా ప్రేమగా మారిందని టాక్. ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య ఈ విషయంపై చర్చలు జరిగాయని, త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

మౌనమే సమాధానమా?

సాధారణంగా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు సెలబ్రిటీలు వెంటనే ఖండించడం చూస్తుంటాం. కానీ, అటు కావ్య కళ్యాణ్ రామ్ కానీ, ఇటు కీరవాణి కుటుంబం కానీ ఈ వార్తలపై ఇప్పటివరకు స్పందించలేదు. వారి మౌనం కూడా ఒక విధంగా ఈ వార్తలు నిజమేనని ఒప్పుకున్నట్లుగా ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఏదేమైనా, ఒక ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడు , ఒక సహజ నటి ఒక్కటవ్వడం టాలీవుడ్‌లో ఒక బ్యూటిఫుల్ జోడీగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News