Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద రణవీర్ ‘ధురందర్ 2’ అరాచకం.. ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! ఆ భారీ డీల్ ఎంతో తెలుసా?
రణవీర్ సింగ్ 'ధురందర్ 2' ఓటీటీ పాట్నర్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాకు జియో హాట్‌స్టార్ భారీ ధరకు డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. స్ట్రీమింగ్ తేదీ, బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి పూర్తి వివరాలను ఈ స్టోరీలో చదవండి.
Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద రణవీర్ ‘ధురందర్ 2’ అరాచకం.. ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! ఆ భారీ డీల్ ఎంతో తెలుసా?
Dhurandhar 2: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన స్పై థ్రిల్లర్ "ధురందర్ 2: ది రివెంజ్". ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. అయితే, థియేటర్లలో సినిమా చూసిన వారు సైతం ఈ విజువల్ వండర్‌ను మళ్లీ ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్ కాదు.. ఈసారి జియో హాట్‌స్టార్!
మొదటి భాగం 'ధురందర్' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయి భారీ వ్యూస్‌ను దక్కించుకుంది. అయితే, సీక్వెల్ విషయంలో నిర్మాతలు రూట్ మార్చారు. తాజా సమాచారం ప్రకారం, 'ధురందర్ 2' డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ కైవసం చేసుకుంది. సినిమా పోస్టర్లపై జియో హాట్‌స్టార్ లోగో ఉండటంతో ఈ విషయం అధికారికంగా ఖరారైంది. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం జియో హాట్‌స్టార్ ఏకంగా రూ.150 కోట్లు వెచ్చించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఫస్ట్ పార్ట్ హక్కులు రూ.85 కోట్లకు అమ్ముడుపోగా, సీక్వెల్‌కు అంతకు దాదాపు రెట్టింపు ధర లభించడం గమనార్హం. ఇటీవలి కాలంలో ఒక హిందీ సినిమాకు జరిగిన అతిపెద్ద డిజిటల్ ఒప్పందాలలో ఇది ఒకటిగా నిలిచిందని చెబుతున్నారు.
స్ట్రీమింగ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే..
ఓటీటీ విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సాధారణంగా పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలైన 45 నుంచి 60 రోజుల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తాయి. ఆ లెక్కన చూస్తే, 2026 జూన్ రెండో వారంలో ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, బాక్సాఫీస్ వద్ద సినిమా జోరు ఇలాగే కొనసాగితే ఈ తేదీ మరికొంత కాలం వెనక్కి వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. ఈ సినిమా కేవలం పెయిడ్ ప్రివ్యూల ద్వారానే ఏకంగా రూ.52.71 కోట్లు సాధించి రికార్డు సృష్టించింది. దాదాపు 4 గంటల నిడివి, 'A' సర్టిఫికేట్ ఉన్నప్పటికీ రణవీర్ సింగ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు థియేటర్స్‌లో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషించారు.