VV Vinayak: కొడాలి నాని లేకపోతే 'ఆది' ఉండేది కాదు.. వి.వి. వినాయక్ షాకింగ్ కామెంట్స్

VV Vinayak: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపు తిప్పిన 'ఆది' సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని దర్శకుడు వి.వి. వినాయక్ వెల్లడించారు.

Update: 2026-03-26 05:38 GMT

VV Vinayak: కొడాలి నాని లేకపోతే 'ఆది' ఉండేది కాదు.. వి.వి. వినాయక్ షాకింగ్ కామెంట్స్

Aadi Movie: టాలీవుడ్ వెండితెరపై మాస్ అనే పదానికి కొత్త నిర్వచనం చెప్పిన దర్శకుల్లో వి.వి. వినాయక్ అగ్రస్థానంలో ఉంటారు. ఫ్యాక్షన్ నేపథ్యాన్ని పౌరుషంతో రంగరించి, రక్తం మరిగే యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఊగిపోయేలా చేయడం ఆయన శైలి. అయితే, టాలీవుడ్ చరిత్రను తిరగరాసిన జూనియర్ ఎన్టీఆర్ 'ఆది' సినిమా వెనుక ఉన్న అసలు కథ తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ సినిమా పుట్టిందే ఒక అనుకోని సలహా వల్ల.

ఒక 'లవ్ స్టోరీ' మాస్ క్లాసిక్‌గా ఎలా మారింది?

వినాయక్ కెరీర్ ఆరంభంలో 'దిల్' వంటి విజయంతో తన ముద్ర వేశారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం వచ్చినప్పుడు, అప్పటి తారక్ ఇమేజ్‌ను బట్టి ఒక క్యూట్ లవ్ స్టోరీని సిద్ధం చేసుకున్నారట. తారక్ అప్పటికే 'నిన్ను చూడాలని', 'స్టూడెంట్ నంబర్ 1' వంటి చిత్రాలతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వినాయక్ కూడా అదే దారిలో వెళ్లాలనుకున్నారు. కానీ, కథా చర్చల సమయంలో అక్కడికి వచ్చిన కొడాలి నాని ఇచ్చిన సలహా మొత్తం సీన్‌ను మార్చేసింది. "మా హీరోతో లవ్ స్టోరీలు వద్దు.. ఏదైనా అదిరిపోయే మాస్ సినిమా చేయండి" అని ఆయన చెప్పిన మాట వినాయక్ మెదడులో బలమైన ముద్ర వేసింది. ఒక దర్శకుడిగా సవాల్‌ను స్వీకరించిన వినాయక్, ప్రేమకథను పక్కన పెట్టి రాత్రికి రాత్రే పౌరుషానికి ప్రతిరూపం లాంటి 'ఆది' కథను సిద్ధం చేశారు.

బాక్సాఫీస్ వద్ద 'ఆది' ప్రభంజనం

"అమ్మతోడు.. అడ్డంగా నరికేస్తా" అనే డైలాగ్ థియేటర్లలో వినిపించినప్పుడు ప్రేక్షకుల స్పందన వర్ణనాతీతం. 'ఆది' చిత్రం కేవలం హిట్ మాత్రమే కాదు, ఎన్టీఆర్‌ను రాత్రికి రాత్రే మాస్ కా బాప్‌గా నిలబెట్టింది. ఒకవేళ ఆ రోజు కొడాలి నాని ఆ మాట చెప్పకపోయి ఉంటే, మనం ఎన్టీఆర్ నుంచి మరో ప్రేమకథను చూసేవాళ్లమేమో కానీ, ఒక లెజెండరీ మాస్ యాక్షన్ హీరో పుట్టుక ఆలస్యమయ్యేదేమో.వినాయక్ మాటల్లో...ఆ రోజు కొడాలి నాని అలా చెప్పకపోయి ఉంటే, తారక్‌తో ఒక రొమాంటిక్ మూవీ తీసేవాడిని. కానీ ‘ఆది’ కథ నా కెరీర్‌ను, తారక్ ఇమేజ్‌ను మలుపు తిప్పిందని ఆయన చెప్పుకొచ్చాడు.

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరొందిన వినాయక్, చిరంజీవితో 'ఠాగూర్', 'ఖైదీ నంబర్ 150' వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు. అయితే, ఇటీవల కాలంలో ఆయనకు కాలం కలిసిరావడం లేదు. ముఖ్యంగా హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో తీసిన 'ఛత్రపతి' రీమేక్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అప్పటి నుండి ఆయన మెగాఫోన్ పట్టుకోలేదు.

Tags:    

Similar News