Nandamuri Balakrishna: ఢిల్లీ వేదికగా బాలయ్యకు అరుదైన గౌరవం: ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు సొంతం!

Nandamuri Balakrishna: నందమూరి నటసింహం, గ్లోబల్ లయన్ నందమూరి బాలకృష్ణకు జాతీయ స్థాయిలో ఘన గౌరవం దక్కింది.

Update: 2026-03-26 07:16 GMT

Nandamuri Balakrishna: ఢిల్లీ వేదికగా బాలయ్యకు అరుదైన గౌరవం: ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు సొంతం!

Nandamuri Balakrishna: నందమూరి నటసింహం, గ్లోబల్ లయన్ నందమూరి బాలకృష్ణకు జాతీయ స్థాయిలో ఘన గౌరవం దక్కింది. దేశ రాజధానిలో బుధవారం ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ (IFFD) 2026’ వేడుకల్లో ఆయనకు ప్రతిష్టాత్మక ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ (జీవితకాల సాఫల్య) పురస్కారాన్ని అందజేశారు. దశాబ్దాలుగా తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన చేసిన అసమాన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు.

భారత్ మండపంలో మెగా ఈవెంట్

ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ‘భారత్ మండపం’ ఈ వేడుకకు వేదికైంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేశ్‌ సాహిబ్ సింగ్ వర్మతో పాటు బాలీవుడ్ దిగ్గజాలు హేమమాలిని, కంగనా రనౌత్, షర్మిలా ఠాగూర్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను ప్రారంభించారు.

దిగ్గజాల సమక్షంలో సత్కారం

ఈ వేడుకలో బాలకృష్ణతో పాటు మరో ఇద్దరు సినిమా దిగ్గజాలకు కూడా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు దక్కాయి. అలనాటి మేటి నటి షర్మిలా ఠాగూర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. లెజెండరీ నటుడు ధర్మేంద్ర తరఫున ఆయన కుటుంబ సభ్యులు ఈ గౌరవాన్ని స్వీకరించారు. ముఖ్యమంత్రి రేఖాగుప్తా చేతులమీదుగా బాలయ్య ఈ అవార్డును అందుకున్నప్పుడు సభికుల హర్షధ్వానాలతో భారత్ మండపం మారుమోగిపోయింది.

మార్చి 31 వరకు వేడుకలు

ఢిల్లీ పర్యాటక, రవాణా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చలనచిత్ర ఉత్సవాలు మార్చి 31 వరకు కొనసాగనున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్‌లో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రూపొందిన ఉత్తమ చిత్రాలను ప్రదర్శించనున్నారు.

Tags:    

Similar News