OTT Releases : వీకెండ్ వినోదాల విందు.. ఓటీటీలోకి వచ్చిన క్రేజీ సినిమాలు ఇవే!

OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ ప్రియులకు పండగే.. విజయ్ సేతుపతి 'కాట్టాన్', రాణి ముఖర్జీ 'మర్దానీ 3' సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో నేడు (శుక్రవారం) ఏకంగా 11 కొత్త సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ వంటి వేదికల్లో అందుబాటులో ఉన్న ఆ క్రేజీ చిత్రాల పూర్తి జాబితా ఈ స్టోరీలో తెలుసుకోండి.

Update: 2026-03-27 10:04 GMT

OTT Releases : వీకెండ్ వినోదాల విందు.. ఓటీటీలోకి వచ్చిన క్రేజీ సినిమాలు ఇవే!

OTT Releases :సాధారణంగా శుక్రవారం వచ్చిందంటే చాలు సినీ ప్రియులకు కొత్త సినిమాల సందడి మొదలవుతుంది. ఈ వారం ఓటీటీలలో రిలీజ్ అవుతున్న కొత్త కంటెంట్‌ ఏంటో చూద్దాం. ఈసారి ఓటీటీలో రిలీజ్ అయ్యే వాటిల్లో కమర్షియల్ సినిమాల కంటే వైవిధ్యమైన కథాంశాలతో కూడిన చిత్రాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి ఏంటో ఈ స్టోరిలో తెలుసుకుందాం.

ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు ఇవే..

ఈ రోజు (శుక్రవారం) దాదాపు 11 సినిమాలు, సిరీస్‌లు వివిధ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ముఖ్యంగా విజయ్ సేతుపతి నటించిన 'కాట్టాన్', రాణి ముఖర్జీ 'మర్దానీ 3', మలయాళ చిత్రం 'మస్తిష్క మరణం' వంటివి సినీ ప్రియుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

నెట్‌ఫ్లిక్స్:

మస్తిష్క మరణం: ఈ సినిమా అవయవ దాన నేపథ్యంలో సాగే ఇంట్రెస్టింగ్ మలయాళ మూవీ. ఇది నెట్‌ఫ్లిక్స్ వేదికగా నేటి నుంచి స్ట్రీమింగ్ కానుంది

మర్దానీ 3: క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది మర్దానీ 3. ఇందులో రాణి ముఖర్జీ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని టాక్. ఇది నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అందుబాటులోకి వస్తుంది.

ది రిటర్న్: యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ ది రిటర్న్. ఇది ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

53 సండేస్: హాలీవుడ్ మూవీ లవర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించినది 53 సండేస్. ఇది నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వస్తుంది.

అమెజాన్ ప్రైమ్:

ఓ రోమియో: ఒక విభిన్నమైన ప్రేమకథతో వస్తున్న హిందీ చిత్రం ఓ రోమియో. నేటి నుంచి ఇది అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వస్తుంది.

హౌస్ ఆఫ్ డేవిడ్ సీజన్ 2: ఫ్యాంటసీ డ్రామా ఇష్టపడే వారికి ఈ ఇంగ్లీష్ సిరీస్ బెస్ట్ ఛాయిస్. హౌస్ ఆఫ్ డేవిడ్ సీజన్ 2 నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

జియో హాట్‌స్టార్:

కాట్టాన్: విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ తమిళ సిరీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లోనూ అందుబాటులో ఉంది. కాట్టాన్ నేటి నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

జీ5:

ప్రజాపతి 2: కుటుంబ కథా చిత్రంగా వస్తున్న బెంగాలీ మూవీ ప్రజాపతి 2. ఈ రోజు నుంచి ప్రజాపతి 2 జీ5 వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

హే కాయ్ నవీన్: మరాఠీ వెబ్ సిరీస్ ప్రియుల కోసం రూపొందింది హే కాయ్ నవీన్. నేటి నుంచి హే కాయ్ నవీన్ జీ5 వేదికగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఆపిల్ టీవీ & సన్ నెక్స్ట్..

ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ (సీజన్ 5): ఆపిల్ టీవీలో పాపులర్ సైన్స్ ఫిక్షన్ సిరీస్. ఇది నేటి నుంచి సీజన్ 5 స్ట్రీమింగ్ కాబోతుంది.

మాయ బింబుమ్: సన్ నెక్స్ట్ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ చిత్రం మాయ బింబుమ్. శుక్రవారం సందర్భంగా ఈ రోజు నుంచే ఈ మూవీ సన్ నెక్స్ట్ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

మొత్తంగా చూస్తే, ఈ వారం పెద్ద స్టార్ హీరోల సినిమాలు లేకపోయినా, థ్రిల్లర్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇష్టపడే వారికి ఓటీటీలో మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఈ వీకెండ్‌లో మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారు.

Tags:    

Similar News