Peddi Pehelwan Glimpse: 'పాణంతో సావుకు ఎదురెళ్లే ఆట'.. రామ్ చరణ్ మాస్ డైలాగ్స్ అదిరిపోయాయ్!
Peddi Pehelwan Glimpse: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే బర్త్ డే ట్రీట్ అందింది.
Peddi Pehelwan Glimpse: 'పాణంతో సావుకు ఎదురెళ్లే ఆట'.. రామ్ చరణ్ మాస్ డైలాగ్స్ అదిరిపోయాయ్!
Peddi Pehelwan Glimpse: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే బర్త్ డే ట్రీట్ అందింది. రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'పెద్ది' (Peddi) గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కా రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్నట్లు గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది.
పొగరున్న 'పెద్ది'గా చరణ్:
ఈ గ్లింప్స్‌లో వినిపించే డైలాగులు థియేటర్లలో ఈలలు వేయించేలా ఉన్నాయి. ముఖ్యంగా "పెద్ది అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా.. పాణంతో సావుకు ఎదురెళ్లే ఆట" అనే డైలాగ్ సినిమాలోని గాఢతను, మాస్ ఎలిమెంట్స్‌ను ఎలివేట్ చేస్తోంది. చివర్లో చరణ్ చెప్పే "ఆటే నా పొగరు" అనే మాట సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
భారీ తారాగణం.. వేగంగా షూటింగ్:
ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉండబోతుందోనని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నద్ధమవుతున్నారు. రామ్ చరణ్ ఇంటెన్స్ లుక్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈ గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.