మొబైల్ ఫోన్ అడిక్షనే ప్రాణ సంకటమైతే? ఏప్రిల్ 3న వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ "సువర్ణ"!

Suvarna Movie: ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై అశోక్ రొయ్య స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం "సువర్ణ".

Update: 2026-03-31 09:54 GMT

మొబైల్ ఫోన్ అడిక్షనే ప్రాణ సంకటమైతే? ఏప్రిల్ 3న వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ "సువర్ణ"!

Suvarna Movie: ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై అశోక్ రొయ్య స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం "సువర్ణ". షకలక శంకర్, పల్లవి, జగదీష్, వర్ణిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శక నిర్మాత అశోక్ రొయ్య మీడియాకు వెల్లడించారు.

కథా నేపథ్యం:

నేటి సమాజంలో మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్న యువత పడే ఇబ్బందులను ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించనున్నారు. "మొబైల్ ఫోన్‌కు బానిసైన సువర్ణ అనే యువతి ఎలా చనిపోయింది? ఆమె దెయ్యంగా ఎందుకు మారింది?" అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుందని దర్శకుడు తెలిపారు. హారర్ ఎలిమెంట్స్‌కు కామెడీని జోడించి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సాంకేతిక హంగులు:

ఈ సినిమాలో గ్రాఫిక్స్ మరియు రీ-రికార్డింగ్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. షకలక శంకర్ మార్క్ కామెడీతో పాటు జబర్దస్త్ రాజమౌళి, పవన్, దేవి తదితరుల నటన సినిమాకు ప్లస్ కానుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. గౌతమ్ రవి రామ్ అందించిన సంగీతం, గోపీనాథ్ కాకర్ల సినిమాటోగ్రఫీ సినిమా మూడ్‌ని ఎలివేట్ చేస్తాయని మేకర్స్ తెలిపారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న "సువర్ణ", వేసవి కానుకగా ఏప్రిల్ 3న థియేటర్లలో సందడి చేయనుంది.


Tags:    

Similar News