Poonam Pandey: పూనమ్ పాండే ప్రెగ్నెంట్..ఈసారి ఎవర్ని బకరా చేశావు తల్లి..?

Poonam Pandey Pregnancy News: బాలీవుడ్ నటి పూనమ్ పాండే తాను గర్భవతినంటూ బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసింది.

Update: 2026-04-01 04:58 GMT

Poonam Pandey

Poonam Pandey Pregnancy: వివాదాలకు కేరాఫ్ అడ్రస్, బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్ ఫొటోలతో కుర్రకారును అలరించే ఈ బ్యూటీ, అప్పుడప్పుడు బాంబు లాంటి వార్తలతో అందరినీ షాక్‌కు గురిచేస్తుంటుంది. తాజాగా పూనమ్ పాండే తను ప్రెగ్నెంట్ అంటూ అధికారికంగా ప్రకటించి నెట్టింట దుమారం రేపింది.

బేబీ బంప్‌తో ఫొటో షూట్.. అసలు కథేంటి?

పూనమ్ పాండే తన సోషల్ మీడియా ఖాతాలో బేబీ బంప్ చూపిస్తూ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. తను తల్లి కాబోతున్నానంటూ గర్భవతిగా ఉన్న ఫొటోలు పోస్ట్ చేయడంతో అవి కాసేపట్లోనే వైరల్ అయ్యాయి. అయితే, ఈ ఫొటోలు చూసి నెటిజన్లు శుభాకాంక్షలు చెప్పడం పక్కన పెట్టి, దారుణంగా ట్రోలింగ్ మొదలుపెట్టారు.

నెటిజన్ల ఫైర్

ఈరోజు ఏప్రిల్ 1 (ఏప్రిల్ ఫూల్స్ డే) కావడంతో, పూనమ్ అందరినీ ఫూల్ చేసేందుకే ఈ 'ప్రెగ్నెన్సీ డ్రామా' ఆడుతోందని జనాలు మండిపడుతున్నారు.నువ్వు ఏది చెబితే అది నమ్మడానికి మేమేమైనా పిచ్చోళ్లమా? అంటూ నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఇంతకు మించిన అబద్ధం దొరకలేదా? అని కొందరు కౌంటర్ ఇస్తుంటే.. పూనమ్ అంటేనే అబద్ధాల పుట్ట అని మరికొందరు ఫైర్ అవుతున్నారు.

పాత చావు డ్రామా గుర్తు చేస్తున్న జనాలు..

పూనమ్ పాండేను నెటిజన్లు ఇంతలా నమ్మకపోవడానికి బలమైన కారణం ఉంది. 2024 ఫిబ్రవరిలో గర్భాశయ క్యాన్సర్ కారణంగా పూనమ్ పాండే మరణించినట్లు ఆమె అకౌంట్ నుంచే పోస్ట్ వచ్చింది. దేశవ్యాప్తంగా అందరూ దిగ్భ్రాంతి చెంది నివాళులు అర్పించారు. కానీ, మరుసటి రోజే నేను బతికే ఉన్నాను.. క్యాన్సర్ పై అవగాహన కోసమే ఈ డ్రామా ఆడాను అంటూ వీడియో రిలీజ్ చేసి అందరినీ విస్మయానికి గురిచేసింది. అప్పట్లో ఆమె వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. చావుతో కూడా డ్రామాలు ఆడుతుందా? అని జనాలు ఛీత్కరించుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఏప్రిల్ 1న ప్రెగ్నెన్సీ అంటూ ఫొటోలు పెట్టడంతో, ఇది కూడా పబ్లిసిటీ స్టంట్ అని నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు.

Tags:    

Similar News