Actress Hema: పబ్‌లో 'ఈగల్ టీమ్' మెరుపు దాడులు.. మళ్ళీ వార్తల్లోకి నటి హేమ.. అసలేం జరిగిందంటే?

Actress Hema: కొండాపూర్‌లోని పబ్‌పై పోలీసుల మెరుపు దాడులు! పార్టీలో ఉన్న నటి హేమకు డ్రగ్స్ పరీక్షలు. పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందంటూ వీడియో రిలీజ్ చేసిన నటి.

Update: 2026-04-03 06:31 GMT

Actress Hema: పబ్‌లో 'ఈగల్ టీమ్' మెరుపు దాడులు.. మళ్ళీ వార్తల్లోకి నటి హేమ.. అసలేం జరిగిందంటే?

Actress Hema: టాలీవుడ్ సీనియర్ నటి హేమ మరోసారి పబ్ పార్టీ వివాదంలో చిక్కుకున్నారు. కొండాపూర్‌లోని ‘క్వాక్ ఏరీనా పబ్’ (Quack Arena Pub)పై పోలీసులు నిర్వహించిన మెరుపు దాడుల సమయంలో ఆమె అక్కడ ఉండటం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

64 మందికి పరీక్షలు.. 8 మందికి పాజిటివ్:

పబ్‌లో డ్రగ్స్ సరఫరా అవుతుందన్న పక్కా సమాచారంతో 'ఈగల్ టీమ్' మరియు స్థానిక పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. పార్టీలో ఉన్న సుమారు 64 మందికి అక్కడికక్కడే డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ సోదాల్లో 8 మంది డ్రగ్స్ సేవించినట్లు తేలింది. వీరిలో ఆరుగురు గంజాయి, మరో ఇద్దరు ఇతర డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు.

లైవ్‌లోకి వచ్చిన హేమక్క.. రిపోర్ట్ చూపిస్తూ వివరణ:

ఈ దాడుల సమయంలో పబ్‌లోనే ఉన్న నటి హేమకు కూడా పోలీసులు పరీక్షలు నిర్వహించారు. అయితే ఆమెకు డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చినట్లు సమాచారం. దీనిపై హేమ వెంటనే స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. "మీ హేమక్క ఎప్పుడూ తప్పు చేయదు.. ఈగల్ టీమ్ చేసిన టెస్టులో నాకు నెగెటివ్ వచ్చింది" అని చెబుతూ తన యూరిన్ టెస్ట్ రిపోర్టును వీడియోలో చూపించారు. పబ్ ప్రాంగణం నుంచే ఆమె ఈ వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది.

గత వివాదాల నీడ:

కొన్ని నెలల క్రితం బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీలో హేమ పేరు వినిపించడం, ఆమె జైలుకు వెళ్లడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆ కేసులో బెంగళూరు కోర్టు ఆమెకు క్లీన్ చీట్ ఇచ్చింది. ఆ వివాదం వల్ల తన తల్లి తీవ్ర ఆవేదనకు గురై కన్నుమూశారని హేమ గతంలో వాపోయారు. ఇప్పుడు క్లీన్ చీట్ వచ్చిన కొద్దిరోజులకే మళ్లీ ఇలాంటి పోలీస్ దాడులు జరిగిన పబ్‌లో ఆమె కనిపించడం గమనార్హం.


Tags:    

Similar News