Peddi: రామ్ చరణ్ పెద్దిపై బిగ్ అప్డేట్.. విడుదల తేదీపై క్లారిటీ వచ్చినట్లేనా.?
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ సినిమా ‘పెద్ది’ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది.
Peddi: రామ్ చరణ్ పెద్దిపై బిగ్ అప్డేట్.. విడుదల తేదీపై క్లారిటీ వచ్చినట్లేనా.?
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ సినిమా ‘పెద్ది’ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం, చరణ్ కెరీర్‌లో మరో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది.
గ్రామీణ నేపథ్యంలో మరో పవర్‌ఫుల్ కథ
‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్ మళ్లీ పూర్తిస్థాయి గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌లో కనిపించనున్న చిత్రం ఇదే. అందుకే అభిమానులు ఈ సినిమాను ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారు. గ్రామ జీవితం, స్థానిక క్రీడలు, భావోద్వేగాలు కలిసిన కథగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం. చరణ్ పాత్ర కూడా మాస్ అండ్ ఎమోషనల్ టచ్‌తో ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది.
‘పహిల్వాన్’ గ్లింప్స్‌తో పెరిగిన అంచనాలు
శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసిన ‘పహిల్వాన్’ గ్లింప్స్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఇందులో చరణ్ కనిపించిన మాస్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ గ్లింప్స్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
రిలీజ్ వాయిదా వార్తలపై చరణ్ స్పందన
గత కొద్ది రోజులుగా ‘పెద్ది’ సినిమా విడుదల వాయిదా పడుతుందనే వార్తలు వినిపించాయి. మొదట ప్రకటించిన ఏప్రిల్ 30 రిలీజ్ డేట్ మారి జూన్‌లోకి వెళ్లొచ్చని ప్రచారం జరిగింది. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో కూడా రిలీజ్ డేట్ లేకపోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లైంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ స్వయంగా స్పందించారు. ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆయన మాట్లాడుతూ, ‘పెద్ది’ సినిమా వాయిదా పడడం లేదని స్పష్టంగా తెలిపారు. ముందుగా ప్లాన్ చేసినట్టే చిత్రం ఏప్రిల్ 30న విడుదల అవుతుందని ఆయన సంకేతాలు ఇచ్చారు.
శరవేగంగా సాగుతోన్న షూటింగ్
ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇంకా కొన్ని రోజులు షూటింగ్ మిగిలి ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఒక ప్రత్యేక పాటను త్వరలో చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేయాలని మేకర్స్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. చిత్ర యూనిట్ అన్ని పనులను సమయానికి ముగించేందుకు కృషి చేస్తోంది.
ఓవర్సీస్‌లో ముందస్తు బుకింగ్స్
సినిమా విడుదలపై వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ విదేశీ మార్కెట్‌లో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏప్రిల్ 8 నుంచి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఇది చూసి ‘పెద్ది’ రిలీజ్ డేట్ మార్చే అవకాశం లేదని సినీ వర్గాలు భావిస్తున్నాయి.