Adah Sharma: నీ సైజ్ ఎంత అని అడిగిన నెటిజన్‌కు అదిరిపోయే కౌంటరించిందిగా..!

Adah Sharma: సోషల్ మీడియా లైవ్ సెషన్‌లో ఒక నెటిజన్ అడిగిన అసభ్యకరమైన ప్రశ్నకు అదా శర్మ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

Update: 2026-04-05 06:58 GMT

Adah Sharma: నీ సైజ్ ఎంత అని అడిగిన నెటిజన్‌కు అదిరిపోయే కౌంటరించిందిగా..!

Adah Sharma: గ్లామర్ ప్రపంచంలో సెలబ్రిటీలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక అభిమానులకు, స్టార్స్‌కు మధ్య దూరం తగ్గిపోయింది. అయితే ఇదే అదునుగా భావించి కొందరు నెటిజన్లు హద్దులు దాటుతుంటారు. తాజాగా నటి అదా శర్మకు ఇలాంటి ఒక చేదు అనుభవమే ఎదురైంది. కానీ ఆమె ఇచ్చిన రిటన్ గిఫ్ట్ చూస్తే ఎవరైనా సరే అదా మజాకా అనాల్సిందే.

సైజ్ ప్రశ్న.. అదా అదిరిపోయే కౌంటర్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అదా శర్మ, తన ఫ్యాన్స్‌తో ముచ్చటించడానికి తరచూ ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్స్ నిర్వహిస్తుంటుంది. ఇలాంటి ఒక లైవ్ సెషన్‌లో ఒక ఆకతాయి నెటిజన్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. అందరూ సినిమా విశేషాలు అడుగుతుంటే, అతను మాత్రం మీ సైజ్ ఎంత? అంటూ అనుచితమైన ప్రశ్న వేశాడు.

సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు చాలా మంది హీరోయిన్లు కోపంతో ఊగిపోతారు లేదా ఆ ప్రశ్నను ఇగ్నోర్ చేస్తారు. కానీ అదా శర్మ రూటే వేరు. ఆమె ఏమాత్రం తడబడకుండా, చాలా కూల్‌గా.. నా సైజ్ 9... ఇది నా చెప్పుల సైజ్ అంటూ తన కాలి చెప్పును కెమెరాకు చూపించింది. అడిగిన వాడికి దిమ్మతిరిగేలా సమాధానం చెప్పడమే కాదు, తనదైన శైలిలో హాస్యాన్ని జోడించి అతగాడి నోరు మూయించింది.

హార్ట్ ఎటాక్ నుండి కేరళ స్టోరీ వరకు

నితిన్ సరసన 'హార్ట్ ఎటాక్' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే 'ది కేరళ స్టోరీ' చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, నటిగా తన విశ్వరూపాన్ని చూపించింది. కేవలం నటనలోనే కాదు, రియల్ లైఫ్‌లో కూడా తనకు సెల్ఫ్ డిఫెన్స్ తెలుసని, తానొక ధైర్యవంతురాలినని ఈ ఘటనతో మరోసారి నిరూపించుకుంది.

అదా శర్మ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇది కదా అసలైన క్లాస్ అంటే అనవసరమైన ప్రశ్నలు అడిగే వారికి ఇలాగే బుద్ధి చెప్పాలి అంటూ నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె సూపర్ వెల్లి అనే చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోంది.




Tags:    

Similar News