Ramayana vs Varanasi: 'వారణాసి' vs 'రామాయణం'..రూ. 1000 కోట్ల సాధ్యమేనా..?

Ramayana vs Varanasi: నితీష్ తివారీ 'రామాయణం' , రాజమౌళి 'వారణాసి' చిత్రాల భారీ ఓటీటీ డీల్స్ పై ఇండస్ట్రీలో పెద్ద చర్చ సాగుతుంది.

Update: 2026-04-05 05:52 GMT

Ramayana vs Varanasi: 'వారణాసి' vs 'రామాయణం'..రూ. 1000 కోట్ల సాధ్యమేనా..?

Ramayana Movie OTT: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా కోట్లతో కూడిన లెక్కలే వినిపిస్తున్నాయి. థియేటర్ వసూళ్ల కంటే ముందే ఓటీటీ (OTT) బిజినెస్ కళ్లు చెదిరే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి, నితీష్ తివారీ ప్రతిష్టాత్మక చిత్రం రామాయణం డిజిటల్ రైట్స్ రేట్లు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.

రాజమౌళి బ్రాండ్ vs రామాయణం క్రేజ్

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాజమౌళి రూపొందిస్తున్న వారణాసి చిత్రానికి దాదాపు రూ. 650 కోట్ల ఓటీటీ డీల్ చర్చల దశలో ఉంది. రాజమౌళికి ఉన్న గ్లోబల్ మార్కెట్ దృష్ట్యా ఈ ఫిగర్ సాధ్యమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, దీనికి పోటీగా రామాయణం నిర్మాతలు ఏకంగా రూ. 1000 కోట్లు డిమాండ్ చేస్తున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భారతీయ సినీ చరిత్రలో ఒక సినిమాకు సంబంధించి ఇంత భారీ మొత్తం కోరడం ఇదే తొలిసారి.

రూ. 1000 కోట్లు.. అత్యాశేనా లేక అద్భుతమా?

ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం రూ. 1000 కోట్ల డీల్ అనేది అసాధ్యంగా కనిపిస్తోంది. దేశవ్యాప్త క్రేజ్ ఉన్న పుష్ప 2 చిత్రానికే డిజిటల్ హక్కులు రూ. 275 - 300 కోట్ల మధ్య పలికాయి. రామాయణం రెండు భాగాలకు కలిపి రూ. 1000 కోట్లు అని చెప్పినా, ఒక్కో భాగానికి రూ. 500 కోట్లు కేటాయించడానికి ఓటీటీ సంస్థలు వెనుకాడే అవకాశం ఉంది. రాజమౌళికి ఉన్న అంతర్జాతీయ రికార్డులు నితీష్ తివారీకి లేవు. కాబట్టి, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

హైప్ క్రియేషన్.. పబ్లిసిటీ స్ట్రాటజీ?

ఈ భారీ అంకెల వెనుక హైప్ క్రియేషన్ అనే పబ్లిసిటీ స్ట్రాటజీ కూడా ఉండవచ్చు. మార్కెట్‌లో రూ. 1000 కోట్ల చర్చ జరగడం వల్ల సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ అవుతుంది. తద్వారా శాటిలైట్ , డిస్ట్రిబ్యూషన్ ఏరియాల్లో భారీ ధరలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, ఇటీవల విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌పై సోషల్ మీడియాలో వస్తున్న మిశ్రమ స్పందన ఈ బిజినెస్‌పై కొంత ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సక్సెస్ మంత్రం ఏంటి?

రామాయణం మొదటి భాగం గనుక బాక్సాఫీస్ వద్ద బాహుబలి 2 లేదా ఆర్ఆర్ఆర్ రేంజ్‌లో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తే, అప్పుడు రెండు భాగాలకు కలిపి రూ. 1000 కోట్ల డీల్ సాధ్యపడవచ్చు. సినిమా విడుదలైన తర్వాత ఆ కంటెంట్ ప్రేక్షకులను మెప్పిస్తే, అప్పుడు డిజిటల్ రైట్స్ విషయంలో చిత్రబృందం ఆడింది ఆట.. పాడింది పాటగా మారుతుంది.

4000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ దృశ్య కావ్యం నిజంగానే అంత వసూలు చేస్తుందా? ఓటీటీ సంస్థలు అంత భారీ మొత్తాన్ని చెల్లిస్తాయా? అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఒకవేళ ఇది నిజమైతే, భారతీయ సినిమా గ్లోబల్ మార్కెట్‌లో మరో మైలురాయిని అధిగమించినట్టే.

Tags:    

Similar News