Visakha updates: విశాఖలో యువకుడి కిడ్నాప్ కలకలం..
విశాఖ...
- ఎంవిపి కాలనీ లో రాకేష్ అనే యువకుడిని కిడ్నాప్ ఎత్తుకెళ్లిన ఆగంతకులు
- తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద కార్ లో తీసుకువెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు
- ఉద్యోగాలు ఇప్పిస్తానని గుంటూరు జిల్లాలో భారీగా డబ్బు వసూలు చేసిన రాకేష్
- దాదాపుగా రూ. కోటి 50 లక్షలు వసూలు చేసిన రాకేష్
- డబ్బు ఇచ్చిన నిరుద్యోగులకు మధ్యవర్తిగా ఉన్న రాకేష్ బంధువులు
- నిరుద్యోగుల నుంచి రాకేష్ బంధువులకు పెరిగిన ఒత్తిడి
- రాకేష్ ను పట్టుకొని గుంటూరు పోలీసులు కు అప్పగించేందుకు తీసుకువెళ్తుండగా పట్టుకున్న పోలీసులు
- విశాఖ పోలీసులు అదుపులో రాకేష్ , అతని బంధువులు
Gunter District Updates: క్రికె బెట్టింగ్ కు యువకుడు బలి, చావు బతుకుల్లో మరొక యువకుడు...
గుంటూరు...
-పెదకూరపాడు మండలం 75త్యాళ్ళూరుకు చెందిన ఊర సురేష్, బెల్లంకొండ బుడగజంగాల కాలనీకి చెందిన కొమరయ్యలకు క్రికెట్ బెట్టింగ్ లతో లక్షల్లో నష్టం.
-డబ్బులకోసం బుకీల వత్తిడి.
-బాకీలు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం.
-బెల్లంకొండ రైల్వే ట్రాక్ వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకులు సురేష్, కొమరయ్యలు.
-చనిపోతున్నామంటూ సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపిన కొమరయ్య.
-ఇద్దరినీ గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించిన బంధువులు.
-చికిత్స పొందుతూ సురేష్ మృతి, కొమరయ్య పరిస్థితి విషమం.
-కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన బెల్లంకొండ పోలీసులు.
Visakha Weather Updates: కోస్తాంధ్రలో నేడు రేపు ఎల్లుండీ ఓ మాదిరి వరకూ వర్షాలు!
విశాఖ...
- రెండు తూర్పు పవనాలు వెంట వెంట వ్యాపించటంతో కోస్తాంధ్రలో నేడు రేపు ఎల్లుండీ ఓ మాదిరి వరకూ వర్షాలు
- ఉరుములు మెరుపులు కూడా కొన్ని ప్రాంతాలలో వర్షాలు..
- 16,17 తేదీల్లో కూడా ఈ ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.
Vizianagaram Updates: గుర్ల మండలం పెనుబర్తి వద్ద కారును ఢీకొన్న లారీ ఐదుగురికి తీవ్ర గాయాలు..
విజయనగరం :
- కారులో ప్రయాణిస్తున్న తల్లీకూతుళ్ళ పరిస్థితి విషమం
- జిల్లా కేంద్రాసుపత్రికి తరలింపు
- హైదరాబాద్ నుంచి పాలకొండ శుభకార్యం నిమిత్తం వెళ్తుండగా ఘటన
Vijayawada Updates: బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది...
విజయవాడ
- ప్రేమిస్తున్నానని,తననే పెళ్లి చేసుకోవాలంటూ యువతిని వేధింపులకు గురిచేస్తున్న ప్రేమోన్మాది అజయ్ కుమార్
- గవర్నర్ పేట 1 డిపోలో అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న బాధిత యువతి
- అదే డిపోలో మెకానిక్ గా విధులు నిర్వహిస్తున్న ప్రేమోన్మాది అజయ్ కుమార్
- కొద్దిరోజుల క్రితమే యువతికి మరో వ్యక్తితో నిశ్చయమైన వివాహం
- తననే పెళ్లి చేసుకోవాలని లేకుంటే చంపేస్తానని యువతి ఇంటికి వెళ్లి కత్తితో బెదిరించిన ప్రేమోన్మాది
- సత్యనారాయపురం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత యువతి
Visakha Updates: పెందుర్తిలో దారుణం...
విశాఖ
- మైనర్ బాలిక పట్ల ఓ వృద్ధుడు, యువకుడు అఘాయిత్యం
- బాలికపై 63 ఏళ్ల సూర్యనారాయణ, 24 ఏళ్ల కార్తీక్ లైంగికంగా లోబరుచుకుని గర్భవతిని చేసిన వైనం
- బాలికకు మాయమాటలు చెప్పి, మభ్యపెట్టి లోబరుచుకున్న వృద్దుడు, యువకుడు
- బాలికకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించిన చికిత్స
- బాలిక గర్భవతిగా వైద్యులు తేల్చగా, బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
Somashila Project Updates: సోమశిల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం...
నెల్లూరు :
-- ఇన్ ఫ్లో 8566 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 6800 క్యూసెక్కులు.
-- ప్రస్తుత నీటి మట్టం 74.664 టీఎంసీలు. పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు
Amaravati Updates: కరోనా సమయంలో దీపావళి సంబరాల పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం...
అమరావతి
- జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం చర్యలు చేపట్టిన ఏపీ సర్కార్
- కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసులు వినియోగం కు అనుమతి
- రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసుల కాల్చుకోవాలని సూచన
- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం
- అమ్మకాలపై కూడా కొన్ని నిషేధ ఆజ్ఞలు జారీ చేసిన ఏపిసర్కార్
- కేవలం కాలుష్యరహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశం
- దీపావళి సామగ్రి అమ్మే షాపుల వద్ద శానిటైజర్ వాడోద్దని అని సూచించిన ప్రభుత్వం...
Vijayawada Updates: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం...
విజయవాడ
- చిట్టినగర్ మిల్క్ ప్రాజెక్ట్ సమీపం లోని పాత ప్రసాద్ థియేటర్లో అగ్ని ప్రమాదం
- మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
- థియేటర్ మూత పడటంతో తప్పిన ప్రాణ నష్టం.
- భయాందోళన చెందిన చుట్టు పక్కల ప్రజలు.
- ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
Chittoor District Updates: పల్లెకు చేరుకున్న వీరజవాను ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివ దేహం...
చిత్తూరు
-- ఐరాల మండలం రెడ్డివారి పల్లెకు చేరుకున్న వీరజవాను ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివ దేహం
-- ఆదివారం కాశ్మీరు సరిహద్దులో చొరబాటుదారులతో జరిగిన భీకర పోరులో వీరమరణం పొందిన జవాను ప్రవీణ్్
-- రెండు రోజుల తరువాత స్వగ్రామానికి పార్థివ దేహం
-- కడసారి చూపుకోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బంధువులు కన్నీటి పర్యంతం
-- వీర జవానుకు జేజేలు పలుకుతూ నినాదాలు