Live Updates: ఈరోజు (11 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 11 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 11 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ఏకాదశి రా.8-33 తదుపరి ద్వాదశి | ఉత్తర నక్షత్రం రా.1-33 తదుపరి హస్త | వర్జ్యం ఉ.9-39 నుంచి 11-10 వరకు | అమృత ఘడియలు సా.6-44 నుంచి 8-15 వరకు | దుర్ముహూర్తంమ.12-06 నుంచి 12-51 వరకు తిరిగి మ.2-22 నుంచి 3-07 వరకు | రాహుకాలం ఉ.11-21 నుంచి 12-06 వరకు | సూర్యోదయం: ఉ.06-06 | సూర్యాస్తమయం: సా.05-22
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 11 Nov 2020 2:44 PM GMT
Vijayawada Updates: నగరంలో ఎటువంటి ధర్నాలకు అనుమతి లేదు..
విజయవాడ
సీపీ బి.శ్రీనివాసులు
-ధర్నాలు, నిరసనలు చేయుటకు ముందస్తు అనుమతి తప్పనిసరి
-ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించని కార్యక్రమాలకు పోలీసు వారి సహకారం ఉంటుంది
-కమీషనరేట్ పరిధిలో సీఆర్పీసీ సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు
- 11 Nov 2020 2:40 PM GMT
Anantapur District updates: పురాతన శివాలయాన్ని కూల్చివేసి సచివాలయం నిర్మాణాన్ని చేపట్టిన రెవెన్యూ అధికారులు..
అనంతపురం:
-నల్లచెరువు మండలం అల్లుగుండు గ్రామంలో పురాతన శివాలయాన్ని కూల్చివేసి సచివాలయం నిర్మాణాన్ని చేపట్టిన రెవెన్యూ అధికారులు.
-సచివాలయ నిర్మాణ పనులను స్థానిక బిజెపి నాయకులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి
-నల్లచెరువు మండలం అల్లుగుండు లోని శివాలయానికి వందేళ్ల చరిత్ర ఉంది.
-ఆలయానికి సంబంధించిన 56 సెండ్ల మన్యాన్ని రెవెన్యూ అధికారులు లంచాలు ఆశించి అన్యాక్రాంతం చేసే ప్రయత్నాలను ఖండిస్తున్నాను.
-ఏపీలో దేవాలయ ఆస్తుల ధ్వంసం, అన్యాక్రాంతం నిరంతరం కొనసాగడాన్ని ఖండిస్తున్నాను.
-జిల్లా అధికారులు పథకం ప్రకారం దేవాలయ భూమి లో ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించడాన్ని బీజేపీ ఖండిస్తోంది.
-ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్మాణాన్ని నిలిపివేయాలి. లేకపోతే జరిగే పరిణామాలకు, శాంతిభద్రతలకు ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించాలి.
- 11 Nov 2020 2:20 PM GMT
Srisailam Updates: శ్రీశైలంలో కార్తీకమాసోత్సవాల నిర్వహణ!
కర్నూలు జిల్లా శ్రీశైలం..
-ఈ నెల 16.11.2020 నుండి 14.12.2020 నుండి కార్తీకమాసోత్సవాలు
-కోవిడ్ నివారణ చర్యలు పాటిస్తూ కార్తీకమాసోత్సవాల నిర్వహణ
-కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు
-దర్శనానికి విచ్చేసే భక్తులు ముందస్తుగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి
-టైమ్‌స్లాట్ పద్దతిలో అనగా కేటాయించిన నిర్ణీత సమయాలలో దర్శనాలకు అనుమతి
-క్షేత్రానికి విచ్చేసే భక్తులు ముందస్తుగా కోవిడ్ పరీక్షలు చేయించుకొనిరావాలి
-భక్తులు మాస్కును ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం తప్పనిసరి
-ప్రతిరోజూ నాలుగు విడతలుగా సామూహిక ఆర్జిత అభిషేకాలు
-10 సంవత్సరాల పై బడి నుండి 65 సంవత్సరాల లోపల వయస్సుగల వారికి మాత్రమే దర్శనాల అనుమతి
-కార్తీకసోమవారాలు, పౌర్ణమిరోజున పుష్కరిణి వద్ద లక్షదీపార్చన మరియు పుష్కరిణి హారతి
-నవంబరు 29వ తేదీన జ్వాలాతోరణోత్సవం
-భక్తులు కార్తికదీపారాధనను చేసుకునేందుకు వీలుగా ఆలయప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ప్రత్యేక ఏర్పాటు
- 11 Nov 2020 2:13 PM GMT
Andhra Pradesh High Court: హైకోర్టులో చీరాల యువకుడి కేసు విచారణ... 17కు వాయిదా!
అమరావతి (హైకోర్టు)..
★ చీరాల దళిత యువకుడి మృతి కేసు దర్యాప్తులో పోలీసులు నిబంధనలు పాటించట్లేదని.. కేసును సీబీఐకి అప్పగించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ వేసిన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది.
★ రాష్ట్రప్రభుత్వం, కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లు రికార్డు కాకపోవటంతో తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
★ చీరాల దళిత యువకుడి మృతి కేసు దర్యాప్తులో పోలీసులు నిబంధనలు పాటించట్లేదని దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ హర్షకుమార్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
★ ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లు రికార్డు కాకపోవటంతో వాటిని రికార్డులోకి ఎక్కించాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
★ తదుపరి విచారణను ఈ నెల17 వ తేదీకి వాయిదా వేసింది.
- 11 Nov 2020 2:09 PM GMT
Amaravati Updates: క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన కేంద్ర బృందం!
అమరావతి..
-హజరైన హోంమంత్రి మేకతోటి సుచరిత, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు,
-చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, వ్యవసాయశాఖ స్పెషల్ సిఎస్ పూనం మాలకొండయ్య,
-రెవెన్యూశాఖ (డిజాస్టర్ మేనేజిమెంట్) ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి,
-డిజాస్టర్ మేనేజిమెంట్ స్పెషల్ కమీషనర్ కె. కన్నబాబు, పలువురు ఉన్నతాధికారులు
- 11 Nov 2020 1:13 PM GMT
Andhra Pradesh Aarogyasri : ఏపీ వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవల విస్తరణ!
ఆంధ్రప్రదేశ్..
-ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంది.
-ఇప్పటికే 7 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతోన్న సేవలను మిగిలిన జిల్లాలకు కూడా వర్తింపజేస్తూ జీవో జారీ చేసింది.
-ఇదివరకే ఆరోగ్యశ్రీలో ఉన్న 2 వేల 2 వందల చికిత్సలకు..మరో 233 చికిత్సలు చేర్చింది ప్రభుత్వం.
-పథకం అమల్లో నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ఆదేశాలు జారీ చేసింది.
- 11 Nov 2020 11:57 AM GMT
Vijayawada Updates: నంద్యాలలో దారుణం....
విజయవాడ
- బాజి, బీజేపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు
- నంద్యాలలో ఒక పేద కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం చాలా భాదకరణం.
- దానికి కారణం అయిన వారని కఠినంగా శిక్షించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి.
- సంఘటన జరిగిన 5 రోజుల తరువాత ఇప్పుడు ప్రభుత్వం కళ్ళు తెరిసింది.
- ఈ అంశం కేవలం ఒక కుటుంబానికి జరిగిన అన్యాయం కానీ మతానికి సంబంధించింది కాదు.
- విధ్వంసక శక్తులు ప్రజల్లో చేరి మతం ముసుగులో విధ్వంసం చేయడానికీ కుట్రలు జరుగుతున్నాయి.
- ఇప్పటి ప్రభుత్వం అన్ని వర్గాలని కులాల వారిగా మతాల వారిగా విడగొట్టి రాజకీయాలు చేస్తున్నాయి.
- దయచేసి మైనారిటీలతో రాజకీయాలు చేయొద్దు అని బీజేపీ కోరుకుంటుంది.
- అభివృద్ధి పక్కన పెట్టి అరాచకాలు, అక్రమాలు చేస్తున్నాయి.
- ముఖ్యమంత్రి, మంత్రులు, స్థాయి దిగజారి మాట్లాడటం బీజేపీ కండిస్తుంది.
- 11 Nov 2020 11:55 AM GMT
Vijayawada Updates: నంద్యాలలో దారుణం....
విజయవాడ
- బాజి, బీజేపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు
- నంద్యాలలో ఒక పేద కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం చాలా భాదకరణం.
- దానికి కారణం అయిన వారని కఠినంగా శిక్షించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి.
- సంఘటన జరిగిన 5 రోజుల తరువాత ఇప్పుడు ప్రభుత్వం కళ్ళు తెరిసింది.
- ఈ అంశం కేవలం ఒక కుటుంబానికి జరిగిన అన్యాయం కానీ మతానికి సంబంధించింది కాదు.
- విధ్వంసక శక్తులు ప్రజల్లో చేరి మతం ముసుగులో విధ్వంసం చేయడానికీ కుట్రలు జరుగుతున్నాయి.
- ఇప్పటి ప్రభుత్వం అన్ని వర్గాలని కులాల వారిగా మతాల వారిగా విడగొట్టి రాజకీయాలు చేస్తున్నాయి.
- దయచేసి మైనారిటీలతో రాజకీయాలు చేయొద్దు అని బీజేపీ కోరుకుంటుంది.
- అభివృద్ధి పక్కన పెట్టి అరాచకాలు, అక్రమాలు చేస్తున్నాయి.
- ముఖ్యమంత్రి, మంత్రులు, స్థాయి దిగజారి మాట్లాడటం బీజేపీ కండిస్తుంది.
- 11 Nov 2020 11:33 AM GMT
Amaravati Updates: రాజధాని తరలింపు కేసులపై న్యాయవాదులకు అనుమతులు...
అమరావతి.....
- రాజధాని తరలింపు కేసులపై సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో వాదనలు వినిపించిన న్యాయవాదులకు ఫీజులు చెల్లింపునకు పరిపాలనా అనుమతులు
- సీఆర్డీఏ నుంచి 2 కోట్ల 36 లక్షల 29 వేల రూపాయలను ఏజీ సహా వివిధ సీనియర్ న్యాయవాదులకు చెల్లింపులు చేసేందుకు అనుమతులు జారీ చేసిన ప్రభుత్వం
- 11 Nov 2020 11:28 AM GMT
Guntur District Updates: జిజిహెచ్ లో కార్పోరేట్ హాస్పిటల్ కంటే ధీటైన వైద్యం అందిస్తున్నారు...
గుంటూరు
- మంత్రి రంగనాధ్ రాజు కామెంట్స్...
- ముఖ్యమంత్రి పాదయాత్ర ముగిసి మూడు సంవత్సరాల గడుస్తున్న సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులు పర్యటిస్తున్నారు.
- సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందడం పై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- కోవిడ్ రోగులకు అత్యున్నతమైన సేవలు జిజిహెచ్ సిబ్బంది అందించారు.
- ఎన్ జి ఒల సహాయంతో నిర్మించిన భవనాన్ని రోగుల సహాయకులకు వినియోగించమని కోరారు.
- డిశంబర్ నాటికి భవనాన్ని పూర్తి చేసి రోగుల సహాయలకు ఉచితంగా భోజనం పెట్టేలా చర్యలు తీసుకుంటున్నాం.
- జిజిహెచ్ ఉన్నంత కాలం ఉచిత భోజన సదుపాయం కొనసాగిస్తాం.
- ముఖ్యమంత్రి జిజిహెచ్ అభివృద్ధి కి మూడు కోట్ల రూపాయలను మంజూరు చేశారు.
- మూడు కోట్ల రూపాయలను తల్లి బిడ్డల వైకర్యాల కల్పనకు వినియోగిస్తాం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire