China: పాకిస్తాన్‌కు పూర్తిగా అండగా నిలుస్తాము..భారత్, పాక్ ఉద్రిక్తతల నడుమ చైనా సంచలన ప్రకటన

Update: 2025-05-11 00:36 GMT

China: భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో పాకిస్తాన్ కు అండగా నిలుస్తామని పేర్కొంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాన్ దార్ తో జరిగిన ఫోన్ సంభాషణలో చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యిూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సంభాషణ సందర్భంగా ప్రస్తుతం నెలకున్న పరిస్థితులను వాంగ్ యిూ పాక్ మంత్రి వివరించినట్లు విదేశాంగ కార్యాలయం తెలిపింది.

సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ సంయమనంతో ఉందని..బాధ్యతాయుత విధానాన్ని అనుసరించిందని వాంగ్ యిూ పేర్కొన్నారు. పాకిస్తాన్ కు చైనా అన్నివేళలా వ్యూహాత్మక సహకార భాగస్వామి అని విడదీయరాని స్నేహమని పేర్కొన్నారు. దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడటంతో పాకిస్తాన్ కు అండగా ఉంటామని చైనా చెప్పినట్లుగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. మరోవైపు యూఏఈ డిప్యూటీ ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయోద్ తోనూ ఇషాన్ దార్ మాట్లాడారు. అటు తుర్కియే విదేశాంగమంత్రి హకన్ ఫిదన్ తో మాట్లాడిన దార్ ప్రస్తుతం నెలకున్న పరిస్ధితులను కూడా వివరించారు. 

Tags:    

Similar News