Sydney Bondi Beach Attack: ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీ బీచ్‌లో రెచ్చిపోయిన దుండగులు
Sydney Bondi Beach Attack: ఆస్ట్రేలియాలో సిడ్నీలోని బాండీ బీచ్‌లో దుండగులు రెచ్చిపోయారు.
Sydney Bondi Beach Attack: ఆస్ట్రేలియాలో సిడ్నీలోని బాండీ బీచ్‌లో దుండగులు రెచ్చిపోయారు. ముసుగులు వెసుకొని బీచ్‌లో పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడారు. ఈ కాల్పులలో దాదాపు 12 మంది పర్యాటకులు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు మొత్తం 50 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు.
పోలీసుల కాల్పుల్లో ఒక దుండగుడు హతమవ్వగా.. మరొకర్ని అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల కాల్పులతో ప్రశాంతంగా ఉన్న బీచ్‌లో ఒక్కసారిగా భయానక పరిస్థితి నెలకొంది. ఈ కాల్పుల ఘటనపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.