Hormuz: హర్మూజ్‌ జలసంధిలో భారత నౌకలకు గ్రీన్ సిగ్నల్.. ఇరాన్ కీలక నిర్ణయం!

Hormuz: అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించేందుకు భారత్ సహా ఐదు మిత్ర దేశాల నౌకలకు ఇరాన్ ప్రభుత్వం అనుమతినిచ్చింది.

Update: 2026-03-26 05:42 GMT

Hormuz: హర్మూజ్‌ జలసంధిలో భారత నౌకలకు గ్రీన్ సిగ్నల్.. ఇరాన్ కీలక నిర్ణయం!

Hormuz: అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించేందుకు భారత్ సహా ఐదు మిత్ర దేశాల నౌకలకు ఇరాన్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చేసిన ప్రకటనను ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ధృవీకరించింది.

మిత్ర దేశాలకు ప్రత్యేక మినహాయింపు

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా హర్మూజ్ జలసంధిలో ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ, తమకు అండగా నిలిచిన దేశాలకు ఇరాన్ ఊరటనిచ్చింది. ఈ జాబితాలో భారత్, చైనా, రష్యా, ఇరాక్, మరియు పాకిస్థాన్ దేశాలు ఉన్నాయి. ఇరాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న దౌర్జన్యాలకు మద్దతు ఇవ్వని దేశాల నౌకలను మాత్రమే అనుమతిస్తామని అరాగ్చీ స్పష్టం చేశారు.

ఊపిరి పీల్చుకున్న భారత వాణిజ్య నౌకలు

ఇరాన్ నిర్ణయంతో గత కొద్దిరోజులుగా హర్మూజ్ వద్ద నిలిచిపోయిన భారత నౌకలకు మార్గం సుగమమైంది. ముఖ్యంగా.. భారత్‌కు చేరుకోవాల్సిన ఐదు గ్యాస్ ట్యాంకర్లు అనుమతుల కోసం వేచి చూస్తున్నాయి. తాజా ప్రకటనతో ఈ ట్యాంకర్లతో పాటు ఇతర సరకు రవాణా నౌకలు తమ గమ్యస్థానాలకు చేరనున్నాయి. ఇంధన దిగుమతుల పరంగా భారత్‌కు ఇది పెద్ద ఊరటగా పరిగణించవచ్చు.

భద్రతకు బదులుగా 'టోల్' వసూలు?

మరోవైపు, హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ (Toll) విధించే దిశగా ఇరాన్ పార్లమెంట్ చట్టం తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు 'బ్లూమ్‌బెర్గ్' నివేదించింది.

"నౌకలకు ఇరాన్ రక్షణ కల్పిస్తున్నందుకు ప్రతిఫలంగా ఈ టోల్ వసూలు చేయాలని భావిస్తున్నారు. దీనిపై అధికారిక ఫార్స్ న్యూస్ ఏజెన్సీ కూడా స్పష్టతనిచ్చింది."


Tags:    

Similar News