Donald Trump: హిస్టరీ క్రియేట్ చేయనున్న ట్రంప్.. యూఎస్ నోట్లపై ఇక అధ్యక్షుడి సంతకం!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకోబోతున్నారు.
Donald Trump: హిస్టరీ క్రియేట్ చేయనున్న ట్రంప్.. యూఎస్ నోట్లపై ఇక అధ్యక్షుడి సంతకం!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకోబోతున్నారు. అమెరికా కరెన్సీ నోట్లపై సంతకం చేయబోతున్న తొలి అధ్యక్షుడిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు. ఈ మేరకు యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
165 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్:
అమెరికాలో 1861 నుంచి కరెన్సీ నోట్లపై ట్రెజరర్ మరియు ట్రెజరీ కార్యదర్శి సంతకాలు ఉండటం ఆనవాయితీగా వస్తోంది. గత 165 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టి, ఇప్పుడు నేరుగా దేశ అధ్యక్షుడి సంతకాన్ని ముద్రించనున్నారు. ట్రెజరీ శాఖ వివరాల ప్రకారం.. ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్‌తో పాటు ట్రంప్ సంతకం ఉన్న తొలి 100 డాలర్ల నోట్లను వచ్చే జూన్ నెలలో ముద్రించనున్నారు.
స్మారక నాణెం కూడా..
అమెరికా స్వాతంత్ర్య వేడుకల గుర్తుగా ట్రంప్ ముఖచిత్రంతో కూడిన స్మారక నాణేన్ని కూడా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నిర్ణయంపై ట్రెజరీ కార్యదర్శి బెసెంట్ స్పందిస్తూ.. "దేశం సాధించిన చరిత్రాత్మక విజయాలను గుర్తుచేసుకోవడానికి ఇంతకంటే గొప్ప మార్గం మరొకటి ఉండదు" అని వ్యాఖ్యానించారు. అమెరికన్ ట్రెజరర్ బ్రాండన్ బీజ్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ, ట్రంప్ ఇందుకు పూర్తి అర్హులని పేర్కొన్నారు.
ఈ పరిణామం అమెరికా ఆర్థిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. జూన్ నుంచి మార్కెట్లోకి రానున్న ఈ కొత్త నోట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరెన్సీ సేకర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.