Iran-US War Crisis 2026: అమెరికాకు నరకం చూపిస్తాం.. 10 లక్షల సైన్యంతో ఇరాన్ యుద్ధ గర్జన!

Iran-US War Crisis 2026: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉగ్రరూపం దాలుస్తున్నాయి.

Update: 2026-03-27 07:36 GMT

Iran-US War Crisis 2026: అమెరికాకు నరకం చూపిస్తాం.. 10 లక్షల సైన్యంతో ఇరాన్ యుద్ధ గర్జన!

Iran-US War Crisis 2026: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా భూతల దాడులకు (Ground Invasion) సన్నద్ధమవుతుందన్న సమాచారంతో ఇరాన్ తన సైనిక శక్తిని సర్వసన్నద్ధం చేస్తోంది. అమెరికా సైన్యం గనుక ఇరాన్ గడ్డపై అడుగుపెడితే వారికి "నరకం" చూపిస్తామని ఇరాన్ సైనిక వర్గాలు హెచ్చరించాయి.

10 లక్షల మంది దళాలు.. 12 ఏళ్ల పిల్లలకు అనుమతి:

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో తన సైనిక ఉనికిని పెంచుతున్న తరుణంలో, ఇరాన్ తన బసిజ్ ఫోర్స్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) విభాగాలను బలోపేతం చేస్తోంది. దాదాపు 10 లక్షల మంది సైనికులను కదనరంగంలోకి దింపేందుకు ఇరాన్ ప్రణాళికలు సిద్ధం చేసింది.

యుద్ధ తీవ్రత దృష్ట్యా ఇరాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. యుద్ధంలో పాల్గొనేందుకు కనీస వయస్సును తగ్గించి, 12 ఏళ్ల పిల్లలను కూడా అనుమతించింది. వీరిని ప్రధానంగా చెక్ పాయింట్ల వద్ద, పెట్రోలింగ్ మరియు లాజిస్టిక్స్ పనుల కోసం వినియోగిస్తున్నట్లు సమాచారం.

ఇజ్రాయెల్‌లో సైనిక సంక్షోభం:

మరోవైపు, ఇరాన్ మరియు దాని ప్రాక్సీలతో సుదీర్ఘంగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ తీవ్రమైన సైనిక కొరతను ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) లో అవసరమైన దానికంటే 12వేల మంది సైనికులు తక్కువగా ఉన్నారని ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, లెఫ్టినెంట్ జనరల్ ఐయాల్ జమీర్ ప్రభుత్వానికి నివేదించారు.

తక్షణమే కొత్త కాన్స్క్రిప్షన్ (సైనిక నియామక) చట్టాలను తీసుకురాకపోతే ఐడీఎఫ్ వ్యవస్థే కూలిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని నెతన్యాహుకు ఆయన ఒక బహిరంగ లేఖ కూడా రాశారు.

ట్రంప్ వ్యూహం - చర్చలు vs యుద్ధం:

అమెరికా ఒకవైపు శాంతి చర్చల గురించి మాట్లాడుతున్నప్పటికీ, మరోవైపు హర్మూజ్ జలసంధిని బలవంతంగా తెరిపించేందుకు వీలుగా తన నౌకాదళాన్ని, బాంబర్లను పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Tags:    

Similar News