Donations for Iran: కాశ్మీర్ లో ఇరాన్ కోసం విరాళాలు.. అప్రమత్తమైన భద్రతా దళాలు
Donations for Iran: ఇరాన్ ప్రజల కోసం కాశ్మీర్ లోయలోని ప్రజలు భారీగా విరాళాలు ఇస్తున్నారు. ఇప్పటికే 18 కోట్ల రూపాయల వాకూ విరాళాలు వచ్చినట్టు తెలుస్తోంది
Donations for Iran
Donations for Iran: ఇరాన్ యుద్ధంలో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు కాశ్మీర్ ప్రజలు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కాశ్మీర్ లోయలో ఇరాన్‌కు మద్దతుగా కోట్లాది రూపాయల విరాళాలు సమకూరాయి. ఇది దేశ భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది. ఈ డబ్బును ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి ఉపయోగించవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి. కాశ్మీర్ లోని మీడియా సమాచారం ప్రకారం, ఇప్పటివరకు ₹179.1 మిలియన్లు ఇరాన్ కోసం విరాళాలుగా వచ్చాయి. ఈ మొత్తంలో 85% షియా సమాజం విరాళంగా ఇచ్చింది. కాశ్మీర్‌లోని షియా ప్రాబల్య ప్రాంతమైన బుద్గామ్ సుమారు ₹95 మిలియన్లు సమీకరించింది.
ఈ నిధుల సేకరణ కార్యక్రమం జకాత్ -సదాకా (దానధర్మాలు) ద్వారా నిర్వహిస్తున్నారు. కొనసాగుతున్న సంఘర్షణ వల్ల ప్రభావితమైన ఇరాన్ పౌరులకు సహాయం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం.
రాయబార కార్యాలయం QR కోడ్..
మీడియా సమాచారం ప్రకారం, భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ప్రత్యక్ష నగదు బదిలీల కోసం ఒక ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచింది. దీనిలో చెల్లింపులు యూపీఐ ద్వారా చేయొచ్చు. దీనివలన విరాళాల మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
అధికార మార్గాల ద్వారానే పంపండి..
జవాబుదారీతనం ఉండేలా చూసేందుకు, రాయబార కార్యాలయంతో సహా అధికారిక మార్గాల ద్వారా నేరుగా డబ్బు పంపాలని అధికారులు ప్రజలకు సూచించారు. స్వచ్ఛంద సంస్థల పేరుతో సేకరించిన నిధులను దుర్వినియోగం చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయని నిఘా వర్గాలు నిధులపై నిఘా..
కొన్ని విరాళాలు తప్పుడు చేతుల్లోకి వెళ్లవచ్చని లేదా దుర్వినియోగం కావచ్చని భయపడుతూ, నిఘా సంస్థలు ఈ నిధులను పర్యవేక్షిస్తున్నాయి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే ప్రజల ఆకాంక్షతో తప్పు లేనప్పటికీ, మధ్యవర్తులు, గుర్తింపు లేని సంస్థలు సేకరించే విరాళాలు బూడిదలో పోసిన పన్నీరులా మారతాయని అధికారులు అంటున్నారు.
కొంతమంది షియా మత నాయకులు, సంస్థలు వివిధ కార్యకలాపాల కోసం ఇరాన్ నుండి ఆర్థిక సహాయం పొందుతున్నారని కూడా దర్యాప్తు సూచిస్తోంది. తగినంత పర్యవేక్షణ లేకపోతే, అటువంటి నిధులను రాజకీయ లేదా ఇతర కార్యకలాపాలను ప్రభావితం చేయడానికి ఉపయోగించవచ్చని అధికారులు అంటున్నారు.
తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం . .
అనధికారికంగా సేకరిస్తున్న విరాళాలపై ఎవరి నియంత్రణ ఉండదని అధికారులు అంటున్నారు . అందువల్ల అవి తీవ్రవాదుల చేతుల్లో పడే అవకాశాలుంటాయని భావిస్తున్నారు . దీంతో విరాళాల సేకరణ జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతా దళాలు నిఘాను పటిష్టం చేశాయి. ఇరాన్ ప్రజలకు నిజంగా సహాయపడాలని అనుకునే వారు నేరుగా ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించి వారి ద్వారా తమ విరాళాలను సురక్షితంగా ఇరాన్ చేర్చొచ్చని భద్రతా బలగాలు , స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు .