‘మా తండ్రిని జైలులో హింసిస్తున్నారు’

తమ తండ్రిని జైలులో మానసికంగా హింసిస్తున్నారని పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కుమారులు కాసిం ఖాన్, సులైమూన్ ఇసా ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2025-12-18 05:01 GMT

ఇస్లామాబాద్ : తమ తండ్రిని జైలులో మానసికంగా హింసిస్తున్నారని పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కుమారులు కాసిం ఖాన్, సులైమూన్ ఇసా ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ తండ్రి ఇమ్రాన్ ఖాన్ ను ‘డెత్ సెల్’ లో మానసిక హింసకు గురిచేస్తున్నారని వాపోయారు. జైలులో ఉన్న తమ తండ్రిని బహుశా మళ్లీ ఎప్పటికీ చూడలేమేమో అన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు. 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ ని జైలులో ఉంచారు. తాము నెలల తరబడి తమ తండ్రిని చూడలేదని, మాట్లాడలేదని వారు అన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇమ్రాన్ ఖాన్ చిన్న కుమారుడు కాసిం ఖాన్ మాట్లాడుతూ, తన తండ్రిని రెండేళ్లుగా ఒంటరిగా నిర్భందించారని, జైలులో ఆయనకు మురికి నీరు ఇస్తున్నారని, హెపటైటిస్ తో చనిపోతున్న ఖైదీల మధ్య ఆయన ఉన్నారని అన్నారు. ఆయనకు ఎలాంటి మానవ సంబంధాలు లేకుండా పూర్తిగా ఏకాంతంలో ఉంచారని ఆరోపించారు.

గత మూడేళ్లుగా జైలులో మగ్గుతున్న పాకిస్తాన్ మాజీ పీఎం, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి దారుణంగా మారింది. పాక్ లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ ని ఆవల్పిండిలోని ఆడియాల జైలులో ఉంచింది. ఇటీవల, ఆయన మరణించినట్లు కూడా వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ వ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ మద్దతుదారులు తీవ్ర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. చివరకు సోదరికి ఇమ్రాన్ ఖాన్ ను కలిసే అవకాశం ఇచ్చారు. దాంతో ఆ వార్త తప్పని తేలింది.

Tags:    

Similar News