Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. క్యూబాకు చమురు విక్రయిస్తే ఆ దేశాలపై భారీ సుంకాలు!

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్య రంగంలో మరోసారి తన కఠిన వైఖరిని ప్రదర్శించారు.

Update: 2026-01-30 05:34 GMT

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్య రంగంలో మరోసారి తన కఠిన వైఖరిని ప్రదర్శించారు. క్యూబాను ఆర్థికంగా ఒంటరి చేసే దిశగా ఆయన కీలక ఉత్తర్వులపై సంతకం చేశారు. క్యూబా దేశానికి చమురు (Oil) విక్రయించే ఏ దేశంపైనైనా సరే, అమెరికా భారీ స్థాయిలో టారిఫ్‌లు (సుంకాలు) విధిస్తుందని ఆయన హెచ్చరించారు.

క్యూబా విషయంలో ట్రంప్ 'జాతీయ అత్యవసర పరిస్థితి' (National Emergency) ప్రకటించడం గమనార్హం. క్యూబా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా పరిణమించాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ దేశానికి వెళ్లే చమురు సరఫరాను అడ్డుకోవాలని అమెరికా నిర్ణయించింది.

ట్రంప్ సంతకం చేసిన ఈ నూతన ఉత్తర్వులు తక్షణమే అంటే.. ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం.. క్యూబాకు చమురు సరఫరా చేసే ఏ దేశమైనా అమెరికా వాణిజ్య ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై భారీగా టారిఫ్‌లు విధిస్తారు. ప్రపంచ దేశాలన్నీ క్యూబాతో చమురు ఒప్పందాల విషయంలో పునరాలోచించుకోవాలని ఈ నిర్ణయం సంకేతాలు పంపుతోంది.

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ముఖ్యంగా క్యూబాకు ప్రధానంగా చమురు సరఫరా చేసే దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికాతో వాణిజ్య సంబంధాలు ఉన్న దేశాలు ఇప్పుడు క్యూబాకు చమురు అమ్మాలా లేక అమెరికా టారిఫ్‌ల నుంచి తప్పించుకోవాలా అన్న సందిగ్ధంలో పడ్డాయి. ఈ పరిణామం గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌తో పాటు దౌత్య సంబంధాలలో కొత్త ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది.

Tags:    

Similar News