Xi Jinping: షి జిన్‌పింగ్‌పై సైనిక తిరుగుబాటు కుట్ర.. చివరి నిమిషంలో తప్పించుకున్న అధ్యక్షుడు

Xi Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌పై సైనిక తిరుగుబాటు కుట్ర జరిగిందన్న కథనాలు కలకలం రేపుతున్నాయి. చివరి నిమిషంలో ప్లాన్ లీక్ కావడంతో జిన్‌పింగ్ తప్పించుకున్నారు.

Update: 2026-01-28 11:53 GMT

Xi Jinping: షి జిన్‌పింగ్‌పై సైనిక తిరుగుబాటు కుట్ర.. చివరి నిమిషంలో తప్పించుకున్న అధ్యక్షుడు

XI Jinping Coup: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటు కుట్ర జరిగిందనే వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. జిన్‌పింగ్‌ను అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో చైనా సైన్యంలో కీలకస్థాయిలో ఉన్న జనరల్స్ ప్రణాళిక రచించినట్లు పాశ్చాత్య మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

నివేదికల ప్రకారం, చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ (CMC) వైస్ చైర్మన్ జాంగ్ యౌషియా, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ లియు జెన్లీ ఈ కుట్రకు నాయకత్వం వహించినట్లు తెలుస్తోంది. జనవరి 18 రాత్రి జిన్‌పింగ్‌ను అదుపులోకి తీసుకునే ఆపరేషన్‌కు వారు సిద్ధమైనట్లు సమాచారం. అయితే, ఆపరేషన్‌కు రెండు గంటల ముందే ఈ విషయం లీక్ కావడంతో జిన్‌పింగ్ అప్రమత్తమయ్యారని కథనాలు చెబుతున్నాయి.

ఆ సమయంలో హోటల్‌లో ఉన్న జిన్‌పింగ్ అక్కడి నుంచి సురక్షితంగా బయటకు వెళ్లి, కుట్రదారులను కౌంటర్ అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కొన్ని నివేదికల ప్రకారం, జిన్‌పింగ్ భద్రతా బలగాలు, జాంగ్ వర్గానికి చెందిన సైనికుల మధ్య తీవ్ర కాల్పులు కూడా చోటుచేసుకున్నాయని తెలుస్తోంది.

ఈ ఘటన అనంతరం జాంగ్ యౌషియా, లియు జెన్లీని అరెస్ట్ చేసినట్లు, అలాగే వారి కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు జిన్‌పింగ్ తల్లి, సోదరికి పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదే సమయంలో చైనా రక్షణ మంత్రిత్వ శాఖ, జాంగ్ యౌషియా, లియు జెన్లీ తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనలు, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారని ప్రకటించింది. చైనా సైనిక అధికారిక పత్రిక పీఎల్ఏ డైలీ కూడా ప్రచురించిన ఎడిటోరియల్‌లో “ఛైర్మన్ బాధ్యత వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశారని” ఆరోపించింది. ఇక్కడ ఛైర్మన్ అంటే షి జిన్‌పింగ్ అని స్పష్టం చేసింది.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, జిన్‌పింగ్ చేపడుతున్న మిలిటరీ ప్రక్షాళన కార్యక్రమాల వల్ల సైన్యంలో అసంతృప్తి పెరిగిందని, ఇదే ఈ కుట్రకు ప్రధాన కారణమై ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News