Donald Trump: ట్రంప్ చేతిపై మిస్టరీ గాయం.. అధ్యక్షుడి ఆరోగ్యంపై ఆందోళన.. అసలు ఏమైందంటే?

Donald Trump Hand Injury Viral: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతికి ఏమైంది? దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ట్రంప్ చేతిపై గాయం కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది.

Update: 2026-01-24 03:00 GMT

Donald Trump: ట్రంప్ చేతిపై మిస్టరీ గాయం.. అధ్యక్షుడి ఆరోగ్యంపై ఆందోళన.. అసలు ఏమైందంటే?

Donald Trump Hand Injury Viral: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన 'ప్రపంచ ఆర్థిక సదస్సు' (WEF) వేదికగా ఆయన ఎడమ చేతిపై ఒక గాయం కనిపించడమే దీనికి కారణం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఘటన నేపథ్యం:

దావోస్ వేదికగా గాజా శాంతి మండలిని ట్రంప్ ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన చేతిని పైకెత్తినప్పుడు ఎడమ చేతి వేళ్లపై ఎర్రటి గాయం స్పష్టంగా కనిపించింది. గతంలో కూడా ఆయన చేతికి ఇలాంటి గుర్తులు కనిపించడంతో, ట్రంప్ ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారా? అనే అనుమానాలు వెల్లువెత్తాయి.

వైట్ హౌస్ క్లారిటీ:

అధ్యక్షుడి ఆరోగ్యంపై వస్తున్న వార్తలను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వెంటనే ఖండించారు. శాంతిమండలి కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు ఒక బల్ల కార్నర్ (Table Corner) బలంగా తగలడం వల్లే ఆ చిన్న గాయం అయిందని ఆమె వివరణ ఇచ్చారు. ట్రంప్ కూడా స్వయంగా దీనిపై స్పందిస్తూ.. "నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఆ గాయానికి ప్రాథమిక చికిత్స తీసుకున్నాను" అని వెల్లడించారు. అయితే, డాక్టర్ల సూచనల మేరకు నొప్పి నివారణ కోసం తాను ఆస్పిరిన్ తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పాత గాయాల గుర్తులేనా?

గతంలోనూ ట్రంప్ చేతిపై ఇలాంటి గాయాలు కనిపించినప్పుడు అమెరికా వైద్య నిపుణులు స్పందించారు. వృద్ధులలో రక్తనాళాలు సున్నితంగా మారి చర్మంపై ఎర్రటి మచ్చలు రావడం (Senile Purpura) సాధారణమేనని, దానివల్ల ప్రాణాపాయం ఏమీ ఉండదని అప్పట్లో వివరించారు. అయినప్పటికీ, అగ్రరాజ్య అధ్యక్షుడి ఆరోగ్యంపై అటు అపోజిషన్ పార్టీలు, ఇటు సోషల్ మీడియా యూజర్లు నిశితంగా గమనిస్తున్నారు.

Tags:    

Similar News