H1B Visa Shock: హెచ్-1బీ వీసాలకు భారీ షాక్.. డాలర్ డ్రీమ్స్‌పై నీళ్లు చల్లిన అమెరికా
H1B Visa Shock: అమెరికా హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. స్టాంపింగ్ అపాయింట్‌మెంట్లు 2027కి మారడంతో భారతీయులపై తీవ్ర ప్రభావం పడుతోంది.
H1B Visa Shock: హెచ్-1బీ వీసాలకు భారీ షాక్.. డాలర్ డ్రీమ్స్‌పై నీళ్లు చల్లిన అమెరికా
H1B Visa Shock: అమెరికా హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు పెద్ద దెబ్బే తగిలింది. డాలర్ డ్రీమర్స్ ఆశల మీద నీళ్లు చల్లుతోంది ట్రంప్ సర్కారు. ఇప్పటికే దాదాపు ఏడాది పాటు వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలకు విరామం కొనసాగుతుండగా, తాజా పరిణామాలతో అపాయింట్‌మెంట్లు నేరుగా 2027 సంవత్సరానికి మారాయి. ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా కేంద్రాల్లో స్లాట్లు పూర్తిగా లభ్యం కాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే స్టాంపింగ్ కోసం భారత్‌కు వచ్చిన కొందరి ఇంటర్వ్యూలు రద్దు కావడంతో వారి ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. అమెరికాలో భార్యా పిల్లలను వదిలి వచ్చిన వారి పరిస్థితి మరీ దారుణం..