Bulgaria Prime Minister Resigns: జెన్ జెడ్ నిరసనలతో కుప్పకూలిన మరో ప్రభుత్వం.. రాజీనామా చేసిన బల్గేరియా ప్రధాని

Bulgaria Prime Minister Resigns: జెన్‌-జీ దెబ్బకు మరో ప్రభుత్వం కూలిపోయింది. బల్గేరియా ప్రభుత్వం 2026 ముసాయిదా బడ్జెట్‌ను రూపొందించింది.

Update: 2025-12-12 07:05 GMT

Bulgaria Prime Minister Resigns: జెన్‌-జీ దెబ్బకు మరో ప్రభుత్వం కూలిపోయింది. బల్గేరియా ప్రభుత్వం 2026 ముసాయిదా బడ్జెట్‌ను రూపొందించింది. ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈ బడ్జెట్‌ని రూపొందించారని యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. దీంతో ప్రభుత్వం వెంటనే ముసాయిదా బడ్జెట్‌ను ఉపసంహరించుకున్నప్పటికీ.. యువత ఆందోళనలు విరమిచలేదు. ప్రధాని రాసెన్‌ జెలియాజ్‌కోవ్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాకముందే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం చేపట్టాలని నిర్ణయించింది. అవిశ్వాస తీర్మానం పార్లమెంట్‌లో ఓటింగ్‌కు రాకముందే.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బల్గేరియా ప్రధాని ప్రకటించారు.

Tags:    

Similar News