Pakistan: రక్తసిక్తమైన ఇస్లామాబాద్‌: మసీదు వద్ద ఆత్మాహుతి దాడి.. 10 మంది దుర్మరణం.. పాక్‌లో ఎమర్జెన్సీ!

Pakistan: పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది.

Update: 2026-02-06 11:26 GMT

Pakistan: పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఒక మసీదు లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 10 మంది దుర్మరణం చెందగా, సుమారు 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ప్రార్థనల సమయంలో ఘోరం

శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలు ముగిసిన తర్వాత భక్తులు మసీదు నుంచి బయటకు వస్తున్న సమయంలో ఒక ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు.పేలుడు తీవ్రతకు మసీదు గేట్లు, గోడలు కుప్పకూలాయి. సమీపంలోని ఇళ్లు, వాహనాలు కూడా భారీగా దెబ్బతిన్నాయి.

ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నగరంలో ఎమర్జెన్సీ విధింపు

బాంబు దాడి నేపథ్యంలో ఇస్లామాబాద్‌ వ్యాప్తంగా ప్రభుత్వం అత్యవసర పరిస్థితి (Emergency) ప్రకటించింది. అన్ని ఆసుపత్రులను అప్రమత్తం చేశారు. భద్రతా బలగాలు మసీదు పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.

Tags:    

Similar News