Operation Hawkeye Strike: సిరియాలోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడ్డ అమెరికా

Operation Hawkeye Strike: సిరియాలోని ఉగ్రస్థావరాలపై అమెరికా విరుచుకుపడింది. ఇటీవల సిరియాలో ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌కు చెందిన ముష్కరుడు అమెరికన్లపై దాడి చేశారు.

Update: 2025-12-20 05:55 GMT

Operation Hawkeye Strike: సిరియాలోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడ్డ అమెరికా

Operation Hawkeye Strike: సిరియాలోని ఉగ్రస్థావరాలపై అమెరికా విరుచుకుపడింది. ఇటీవల సిరియాలో ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌కు చెందిన ముష్కరుడు అమెరికన్లపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు అమెరికన్లు మరణించగా.. మరో ముగ్గురు సర్వీస్‌ సభ్యులు గాయపడ్డారు. దీనికీ ప్రతికారంగా సిరియాలోని ఉగ్రమూకల స్థావరాలపై అమెరికా భారీగా వైమానిక దాడులు చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ ప్రకటించారు. సిరియాలో ఐసీస్‌ ఉగ్రవాదులను ఏరివేయడానికి ‘ఆపరేషన్‌ హాక్‌ఐ స్ట్రైక్‌’ను ప్రారంభించామని వెల్లడించారు.

ఉగ్రమూకల అరాచకాలకు ధీటుగా సమాధానమిచ్చామన్నారు. ఇటీవల అమెరికా దళాలపై జరిగిన దాడికి ప్రతికారంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టామని తెలిపారు. ఇది యుద్ధానికి ప్రారంభం కాదని.. ప్రతీకారం మాత్రమేనని రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ అన్నారు. ట్రంప్‌ నాయకత్వంలో అమెరికా ప్రజలను రక్షించడానికి.. ఎప్పుడూ వెనకడుగు వేయమని తెలిపారు. అమెరికన్లను లక్ష్యంగా చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా.. అమెరికా వేటాడి, కనిపెట్టి నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుందని రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ హెచ్చరించారు.

Tags:    

Similar News