Earthquake: జపాన్ తీరంలో మరోసారీ భారీ భూకంపం
Earthquake: జపాన్ తీరాన్ని మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. ఈశాన్య జపాన్‌లోని కుజీ (Kuji) పట్టణ ప్రాంతంలో భూమి తీవ్రంగా కంపించింది.
Earthquake: జపాన్ తీరంలో మరోసారీ భారీ భూకంపం
Earthquake: జపాన్ తీరాన్ని మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. ఈశాన్య జపాన్‌లోని కుజీ (Kuji) పట్టణ ప్రాంతంలో భూమి తీవ్రంగా కంపించింది. జపాన్ మెటలర్జీకల్ ఏజెన్సీ (JMA) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో నమోదైంది. ఈ తాజా భూకంపం కారణంగా తీర ప్రాంతాలకు సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు తక్షణమే హెచ్చరికలు జారీ చేశారు.
కుజీ పట్టణానికి 130 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో భూకంపం కేంద్రీకృతమైంది. సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ మెటలర్జీకల్ ఏజెన్సీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం, నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.