టీఆర్‌ఎస్‌ తాజా మాజీ ఎమ్మెల్యేకు ఝలక్‌

Update: 2018-10-24 05:36 GMT

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్ పేటలో టీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ బాబును గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రచారానికి వచ్చిన సతీష్ బాబు ను గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. తమ నాయకుడిని అడ్డుకోవంతో సహించలేని టీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళనకారులను పక్కకు నెట్టేశారు. మహిళలతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న చిగురుమామిడి సురేందర్‌ సీఐ అక్కడికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. తమపై ఎన్ని కేసులు పెట్టినా సరే సతీశ్‌ను గ్రామంలోకి రానివ్వమంటూ నినదించారు. 15 ఏళ్లుగా మట్టిరోడ్లతో ఇబ్బంది పడుతున్నామని, తాగడానికి మంచి నీళ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గతంలో కూడా వొడితెలకు ఇలాంటి అనుభవాలు చాలానే ఎదురయ్యాయి. తాజాగా ప్రచారంలో భాగంగా తనకు అడ్డుపడిన వారిపై సతీశ్‌ బూటు కాలితో దాడి చేయడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. 
 

Similar News