50 రోజులు.. 100 సభలు

Update: 2018-09-05 08:39 GMT

తెలంగాణలో ముందస్తుపై ఎన్నికలపై టీఆర్ఎస్‌ వేగంగా  పావులు కదుపుతోంది. శాసనసభ రద్దుపై మంత్రివర్గం రేపు తుది నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించి రేపటికల్ల హైదరాబాద్ చేరుకోవాలంటూ మంత్రులను సీఎం ఆదేశించారు. దీంతో ఇప్పటికే పలువురు మంత్రులు  హైదరాబాద్ చేరుకున్నారు.  రేపు మధ్యాహ్నం 2 గంటలకు భేటి కానున్న  మంత్రి వర్గం అసెంబ్లీని  రద్దు చేస్తూ ఏక వాక్య తీర్మానాన్ని ఆమోదించనున్నట్టు సమాచారం. అనంతరం సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి ఇదే అంశాన్ని వివరించనున్నారు. ముందస్తు ఎన్నికలపై ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన టీఆర్ఎస్ ఎన్నికలు జరిగే లోపు  100 నియోజకవర్గాల్లో సభలకు సన్నాహాలు చేస్తున్నారు. 50 రోజుల పాటు 100 నియోజకవర్గాల్లో 100 బహిరంగ సభలు నిర్వహించేలా యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. రోజూ రెండు నియోజకవర్గాల్లో నిర్వహించే ఈ సభల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ రద్దుపై మంత్రి హరీష్‌రావు పరోక్షంగా సంకేతాలిచ్చారు. 

Similar News