కేసీఆర్ సర్కార్ కు కేంద్రం ఊహించని షాక్

Update: 2018-10-16 05:40 GMT

తెలంగాణ ప్రభుత్వానికి  మోదీ సర్కార్ ఊహించని షాకిచ్చింది.  కేంద్రం కేటాయించిన నిధులను వినియోగించుకోకుండా తాత్సారం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు  2016-17 ఏడాదికి గాను కేంద్రం తెలంగాణకు 70 వేల 674 ఇళ్ల కోసం 190.78 కోట్లను కేటాయించింది. అయితే ఈ నిధుల్లో తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. రెండేళ్లు గడిచినా  నిధులను వినియగించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 

ఇటీవల కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సమీక్షలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.  తెలంగాణ ప్రభుత్వం నుంచి నిధులను వెనక్కు తీసుకుని అవసరమైన ఇతర రాష్ట్రాలకు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. PMAY ద్వారా వచ్చిన నిధులుపై ఇంత వరకు కనీసం కూడా నివేదినకు సమర్పించకపోవడం పై కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.  దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద 50లక్షల ఇళ్లు నిర్మాణం చేపట్టింది.  రెండో విడత ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఇంత వరకు నిధులు కూడా అడగకపోవడంతో  తొలి దశకే కేటాయింపులు పరిమితమయ్యాయి.  PMAY వెబ్‌సైట్‌లో ఇండ్ల నిర్మాణ వివరాలు అప్‌డేట్ చేసేందుకు కూడా టీ సర్కార్‌ నిరాకరించడంతో నిధులను వెనక్కు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చింది.  
 

Similar News