54 ఏళ్ల మహిళను మింగిన కొండచిలువ

Update: 2018-06-16 08:13 GMT

మహిళను కొండ‌ చిలువ మింగిన ఘ‌ట‌న ఇండోనేషియాలో ని మునా ఏజెన్సీలో జరిగింది. 8 మీటర్ల కొండచిలువను కోయగా.. దాని కడుపులో 54 ఏళ్ల వా తిబా అనే గృహిణి శరీరం బయటపడింది. గురువారం అర్థరాత్రి ఆ మహిళ అదృశ్యమైనట్లు మునా పోలీస్ చీఫ్ సీనియర్ కమ్రేడ్ అగుంగ్ రామోస్ పరటోంగన్ తెలిపారు. ఇంటి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న మొక్క జోన్న చేనుకు వెళ్లిన తర్వాత ఆమె కనిపించకుండాపోయింది. పందులు పంటను నాశనం చేస్తున్నాయని, వాటిని వెళ్లగొట్టాలన్న ఉద్దేశంతో ఆమె తన ఇంటి వద్ద ఉన్న మొక్క జొన్న చేనుకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె అదృశ్యమైనట్లు తెలిసింది. మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కూడా ఆమె తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో గ్రామస్తులు ఓ భారీ పైతాన్‌ను కనుగొన్నారు. ఆ కొండచిలువను కోయడంతో దాని కడుపులో నుంచి ఆ మహిళ మృతదేహం బయటపడింది.

Similar News