Indonesia: జకార్తాలో అగ్నిప్రమాదం.. 22 మంది మృతి
Indonesia: ఇండోనేసియా రాజధాని జకార్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Indonesia: జకార్తాలో అగ్నిప్రమాదం.. 22 మంది మృతి
Indonesia: ఇండోనేసియా రాజధాని జకార్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని ఓ భవనం మొదటి అంతస్తులో ఉన్న డ్రోన్ల కంపెనీ గోదాంలో బ్యాటరీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకొని 22 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో గర్భిణితో సహా 15 మంది మహిళలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలు సమీప భవనాలకు వ్యాపించడంతో అక్కడ ఉంటున్నవారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. డ్రోన్ బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్, థర్మల్ వైఫల్యం ప్రమాదానికి కారణం కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.