కరుణానిధి శవపేటిక మీద ఏం రాశారు?

Update: 2018-08-08 11:21 GMT

కరుణానిధిని ఉంచే శవపేటిక మీద తమిళంలో రాసి ఉన్న మాటలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. బంగారంతో పోత పోసిన శవపేటిక మీద ఇలా రాసి ఉంది. ‘విరామమన్నది ఎరుగక, నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఇక్కడ విశ్రమిస్తున్నాడు’.. ఈ మాటలు కరుణానిధికి వర్తించినంత బాగా ఇంక ఎవరికి వర్తించవేమో. అందుకే శాశ్వత నిద్రలోకి జారుకుని విశ్రమిస్తోన్న ‘కలైజ్ఞర్‌’ శవపేటిక మీద ఈ మాటలనే చెక్కించారు. ఒకానొక సందర్భంలో కరుణానిధి తన కుమారుడు స్టాలిన్‌తో ‘మన సమాధి చూసిన జనాలు విశ్రాంతి అన్నది ఎరగకుండా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ సేద తీరుతున్నారని’ అనుకోవాలని చెప్పారట. ఈ మాటలు కరుణానిధికి సరిగ్గా సరిపోతాయి. అందుకే ఆయన శవ పేటికి మీద కొడుకు స్టాలిన్‌తో చెప్పిన మాటలనే తమిళంలో చెక్కించారు.

Similar News