Nirmala Sitharaman: ఇవాళ, రేపు కర్ణాటకలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా పర్యటన

Nirmala Sitharaman: ఇవాళ, రేపు కర్ణాటకలో పర్యటించనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.

Update: 2025-12-20 05:59 GMT

Nirmala Sitharaman: ఇవాళ, రేపు కర్ణాటకలో పర్యటించనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. విజయనగర జిల్లాలో పర్యటించనున్న నిర్మలా.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమరావతి పాఠశాలలో విజయపథ్‌ పథకాన్ని ఆమె ప్రారంభిస్తారు. ఇక.. ఇవాళ రాత్రి ఏడున్నర గంటలకు హంపికి చేరుకుని.. అక్కడే బస చేస్తారు.

రేపు ఉదయం హంపి అభివృద్ధి ప్రాధికార కార్యాలయంలో మొక్కలు నాటనున్నారు నిర్మలా సీతారామన్. అనంతరం అనంతపురం విజయపుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్‌ పోలియో కార్యక్రమంలో పాల్గొని.. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో డ్రాప్స్‌ వేయనున్నారు. రేపు రాత్రికి హంపిలోనే బస చేయనున్న సీతారామన్ ఎల్లుండి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు. 

Tags:    

Similar News