లోక్‌సభ స్పీకర్ సంచలనం: "మోదీపై దాడికి విపక్షాల స్కెచ్.. అందుకే ప్రధానిని సభలోకి రావొద్దని చెప్పా!"
Om Birla: లోక్‌సభలో చోటుచేసుకున్న పరిణామాలపై స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Om Birla: లోక్‌సభలో చోటుచేసుకున్న పరిణామాలపై స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో ప్రధాని నరేంద్ర మోదీపై దాడి చేసేందుకు విపక్ష ఎంపీలు ప్రణాళిక రచించారని, వారి ప్రవర్తన అత్యంత ప్రమాదకరంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ అసాధారణ పరిస్థితుల నేపథ్యంలోనే ప్రధానిని సభలోకి రావొద్దని తాను స్వయంగా సూచించినట్లు స్పీకర్ తెలిపారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష ఎంపీలు సభా మర్యాదలను పూర్తిగా ఉల్లంఘించారని ఓం బిర్లా మండిపడ్డారు. "పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగలేదు. ప్రధానిని లక్ష్యంగా చేసుకుని భౌతిక దాడికి దిగేలా విపక్ష సభ్యులు వ్యవహరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రధాని రక్షణను దృష్టిలో ఉంచుకుని ఆయనను సభకు రావొద్దని కోరాను" అని స్పీకర్ పేర్కొన్నారు. విపక్షాల ఈ తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.