PM Modi: ఇవాళ పశ్చిమబెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన
PM Modi: ప్రధాని మోడీ ఇవాళ పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు.
PM Modi: ఇవాళ పశ్చిమబెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన
PM Modi: ప్రధాని మోడీ ఇవాళ పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మోడీ నదియా జిల్లాలోని రాణాఘాట్‌లో దాదాపు 3వేల 200 కోట్ల రూపాయల విలువైన రెండు జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వాటిని ప్రారంభించనున్నారు. నదియా జిల్లాలో 66 కిలోమీటర్ల పొడవైన బరాజగులి-కృష్ణానగర్ సెక్షన్‌ను నాలుగు వరుసలుగా విస్తరించే ప్రాజెక్టును మోడీ ప్రారంభిస్తారు. అనంతరం ఉత్తర జిల్లాలో 17.6 కిలోమీటర్ల పొడవైన బరాసత్- బరాజగులి సెక్షన్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేస్తారు.