Delhi Fog Crisis: ఉత్తర భారతదేశాన్ని కమ్మేస్తున్న పొగమంచు, వాయుకాలుష్యం.. ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసిన IMD

Delhi Fog Crisis: ఉత్తర భారతదేశాన్ని పొగమంచు అతలాకుతలం చేస్తోంది.

Update: 2025-12-20 06:02 GMT

Delhi Fog Crisis: ఉత్తర భారతదేశాన్ని కమ్మేస్తున్న పొగమంచు, వాయుకాలుష్యం.. ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసిన IMD

Delhi Fog Crisis: ఉత్తర భారతదేశాన్ని పొగమంచు అతలాకుతలం చేస్తోంది. దేశరాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాల్లో విజిబిలిటీ కొన్నిచోట్ల సున్నాకి పడిపోయింది. ఈ తీవ్ర పరస్థితుల నేపథ్యంలో IMD ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొగమంచు ప్రభావంతో ఢిల్లీలో 150కి పైగా విమాన సర్వీసులు రద్దు కాగా, వందలాది రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్లపై వాహనదారులు కనీసం 50 మీటర్ల దూరాన్ని కూడా చూడలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల పలు చోట్ల రోడ్డుప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.

పొగమంచే కాకుండా, ఢిల్లీలో వాయు కాలుష్యం కూడా తీవ్ర స్థాయికి చేరుకోవడంతో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గ్రాప్ స్టేజ్-4 ఆంక్షలను అమలు చేస్తోంది. 5వ తరగతి వరకు విద్యార్థులకు పాఠశాలలు మూసివేసి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని, కార్యాలయాల్లో 50 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సేవలకు తప్ప మిగిలిన భారీ వాహనాలకు ఢిల్లీలోకి ప్రవేశం నిషేధించారు. రాబోయే రెండు మూడు రోజుల పాటు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News