కోర్టు తీర్పుపై ప్రభుత్వం స్పందించకపోతే రేపు హైకోర్టులో మరో పిటిషన్ వేస్తా : కోమటిరెడ్డి

Update: 2018-06-05 12:12 GMT

తన శాసనసభ సభ్యత్వంపై.. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. కోర్టు తీర్పుపై ప్రభుత్వం స్పందించకపోతే రేపు హైకోర్టులో మరో పిటిషన్ వేస్తానన్నారు. నల్గొండకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం వివక్ష చూపుతోందని.. కోమటిరెడ్డి విమర్శించారు.

తన రాజకీయ జీవితంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడితే ...నేడు కేసీఆర్ అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు  రైతుల పంటలకు మద్దతు ధర ప్రకటించడం తెలియదు కాని  అనవసర పధకాలకు వేల కోట్లు కేటాయిస్తున్నారని విమర్శించారు .బంగారు తెలంగాణ కాదు బ్రస్ట్ పట్టిన తెలంగాణగా మార్చారని ..శ్రీశైలం సొరంగం మార్గం పనులు చేయడంలేదు కాని ...వేల కోట్ల తో అదిగో ఇదిగో కాళేశ్వరం అంటూ ఉదరగొడుతున్నారని విమర్శించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి .

Similar News