గవర్నర్‌ నరసింహన్‌ టీఆర్‌ఎస్‌లో చేరాలి

Update: 2018-01-21 09:55 GMT

కాళేశ్వరం ప్రాజెక్టు అత్యద్భుతమంటూ గవర్నర్ నరసింహన్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాళేశ్వరం చంద్రశేఖరరావుగా, మంత్రి హరీష్ రావును కాళేశ్వర్ రావుగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ పై టీసీఎల్పీ ఉపనేత జీవన్‌ రెడ్డి ఆదివారం మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం గవర్నర్‌ నరసింహన్‌ టీఆర్‌ఎస్‌ ప్రాజెక్టు ఏజెంట్‌లా మాట్లాడారని ఫైర్‌ అయ్యారు.

రాజకీయ భిక్ష కోసమే గవర్నర్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్వాపరాలను తెలుసుకోకుండా గవర్నర్‌ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. రాజకీయాల పట్ల ఆసక్తి, కేసీఆర్‌పై విశ్వాసం ఉంటే గవర్నర్‌ నరసింహన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాలని అన్నారు. శనివారం కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశించి నరసింహన్‌ చేసిన వ్యాఖ్యలు గవర్నర్‌ హోదాను కించపరిచేలా ఉన్నాయని అన్నారు.

Similar News