మంత్రులను వెంటాడిన తేనెటీగలు

Update: 2018-06-07 09:48 GMT

జగన్ ప్రజా సంకల్పయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. కానూరు క్రాస్ రోడ్డు దగ్గర  పాదయాత్రగా వెళుతుండగా తేనేటీగలు దాడి చేశాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ...టవాళ్లు అడ్డం పెట్టి యాత్ర కొనసాగించారు. తేనేటీగల దాడిలో పది మందికి గాయాలయ్యాయి.

గతంలో తెలంగాణలోనూ తేనెటీగల దాడికి మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ కూడా పరుగులు పెట్టారు. కరీంనగర్‌లో జిల్లాలో కురిసిన వడగండ్ల వానకు నాశనమైన పంట నష్టాన్ని పరిశీలించేందుకు కేటీఆర్, ఈటల స్థానిక నేతలతో పంట పొలాలకు వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా దాడి చేసిన తేనెటీగలు అందరినీ పరుగులు తీయించాయి. 

మామిడి తోటల్లో పంట నష్టాన్ని పరిశీలించిన అనంతరం మంత్రులు వెనుతిరిగారు. ఇంతో ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో ఓ గుంపుగా వచ్చిన తేనెటీగలు వారిపై దాడి చేశాయి. దీంతో మంత్రులు, స్థానిక నేతలు అక్కడినుంచి పరుగుతీశారు. కేటీఆర్, ఈటల కార్లలో కూర్చొని తలుపులు వేసుకోగా, మిగిలిన వారంతా పరుగులు తీశారు. 

Similar News