కేసీఆర్ కంటి వెలుగు యాడ్ లో ముందస్తు సంకేతాలు?

Update: 2018-08-25 03:41 GMT

కేసీఆర్ ఏం చేసినా దానికో రీజనుంటుందా? గులాబీ బాస్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికో విశేషముంటుందా? ముందస్తు ఎన్నికల సన్నాహాలు అసలు ఎప్పటినుంచి మొదలయ్యాయి? కేసిఆర్ తన ప్రకటనల ద్వారా ముందస్తు సంకేతాలు ఇవ్వకనే ఇచ్చేశారా?

ముందస్తు ఎన్నికలపై కేసిఆర్ చాలా చాలా ముందు చూపుతోనే ఉన్నారా? ఈ ఆలోచన చాలా నెలల క్రితమే చేశారా? పార్టీ శ్రేణులు, కార్యకర్తలు లేదు లేదని ఎంత చెబుతున్నా అధినేత స్పీడు కారు జోరు చూస్తుంటే పక్కా ప్లాన్ తోనే కేసిఆర్ ముందస్తు సన్నాహాలు చేసుకుంటున్నారనిపిస్తోంది.  హటాత్తుగా పార్టీ శ్రేణులతో అంతర్గత సమావేశం పెట్టి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ సంకేతాలిచ్చారు ఒకరిద్దరికి సీట్లు గల్లంతు అని కూడా సంకేతాలిచ్చారు  ఉన్నట్లుండి ఢిల్లీ బయల్దేరారు ప్రధాని ఇతర మంత్రుల అపాయింట్ మెంట్లు ఫిక్స్ చేసుకున్నారు ప్రగతి  నివేదన సభకు ముహూర్తం కూడా నిర్ణయించారు ఇవన్నీ ముందస్తు సంకేతాలు కాదా అంటే కాదు  కాదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. విభజన హామీల అమలు కోసం మాత్రమే కేసిఆర్ ఢిల్లీ వెడుతున్నారంటూ పార్టీ నేతలు పైకి చెబుతున్నారు కానీ టిఆరెస్ అందరికన్నా రహస్యంగానే ముందస్తు సన్నాహాలు చేసేసుకుంటోంది. ఈ మధ్య కాలంలో కేసిఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ముమ్మరం చేసింది. ఆ పథకాలు ప్రజల్లోకి వెళ్లేందుకు వీలుగా వాణిజ్య ప్రకటనలూ ఎక్కువ చేసింది.

వాటిల్లో ఒకటైన కంటి వెలుగు పథకాన్ని  కాస్త నిశితంగా గమనిస్తే.. కేసిఆర్ ముందు చూపు ఎంతుందో అర్ధమవుతుంది. కంటి వెలుగు పథకం ప్రచారానికి వినియోగిస్తున్న యాడ్ లో ముందస్తు సంకేతాలను గులాబీ బాస్ ఇవ్వకనే ఇచ్చారనుకోవాలా?  యాడ్ లో వ్యక్తి ముందస్తు ఎన్నికల ఊహాగానాలపై వార్తనే చదువుతుంటే చూపు మసకబారినట్లు చూపించారు. అది ప్రకటన కోసమే అయినా ఒక్క దెబ్బకు  రెండు పిట్టలన్నట్లుగా అటు ముందస్తు సంకేతాలు, ఇటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రకటన రెండు పూర్తయ్యాయి దటీజ్ కేసిఆర్.

Similar News