ఖాకీ వనంలో గంజాయి మొక్క

Update: 2018-06-12 11:28 GMT

అతడో ఏఆర్ కానిస్టేబుల్ చట్టాన్ని కాపాడాల్నిన వాడు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో భార్యకు విడాకుల నోటిస్ పంపించాడు. తన భర్త నిర్వాకంపై భార్య పోలీసులను ఆశ్రయించింది. న్యాయం కావాలని డిమాండ్ చేస్తోంది. మంచిర్యాలకు చెందిన స్రవంతిని ప్రేమించానని హన్మకొండ ఏఆర్ కానిస్టేబుల్  శ్రవణ్ వెంటపడ్డాడు. 2012లో  పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది స్రవంతి. పెళ్లి సమయంలో స్రవంతి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చారు. వివాహం అయిన ఏడాదికే భార్యకు అదనపు కట్నం కోసం వేధించాడు. అప్పుడు భర్త శ్రవణ్ పై భార్య స్రవంతి ఫిర్యాదు చేయగా...ఇరువురిని పోలీసులు సముదాయించి పంపించారు. 

స్రవంతికి వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. దీంతో  భార్యకు ఏఆర్ కానిస్టేబుల్ శ్రవణ్ విడాకుల నోటిస్ పంపించాడు. భర్త నిర్వాకంపై స్రవంతి పోలీసుఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మరో యువతితో శ్రవణ్ వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని బాధితురాలు స్రవంతి వాపోతుంది. తన ముగ్గురు ఆడపిల్లల బతుకు ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తోంది. 

Similar News