AP Election Results: ఈసీ సంచలన నిర్ణయం.. బాణసంచా విక్రయాలపై నిషేధం..

Election Commission: ఏపీలో ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-05-23 06:03 GMT

AP Election Results: ఈసీ సంచలన నిర్ణయం.. బాణసంచా విక్రయాలపై నిషేధం..

Election Commission: ఏపీలో ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. బాణసంచా విక్రయాలపై ఈసీ నిషేధం విధించింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడే నేపథ్యంలో.. ఏపీలో ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు రద్దు చేసింది ఈసీ. రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా విక్రయాలపై నిషేధం విధించామని.. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఏపీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 168 ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. కాగా సమస్యాత్మక ప్రాంతాల్లో గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు. అల్లర్లకు పాల్పడుతున్నవారిపై చార్జ్‌షీట్‌లు బుక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిపై పీడీ యాక్ట్ అమలు చేశారు.

Tags:    

Similar News