Divvela Madhuri: శ్రీవారి కొండపై బర్త్‌డే వేడుకలు.. దివ్వెల మాధురి వ్యవహారంపై టీటీడీ సీరియస్!
Divvela Madhuri: కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో నిబంధనల ఉల్లంఘన మరోసారి చర్చనీయాంశమైంది.
Divvela Madhuri: శ్రీవారి కొండపై బర్త్‌డే వేడుకలు.. దివ్వెల మాధురి వ్యవహారంపై టీటీడీ సీరియస్!
Divvela Madhuri: కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో నిబంధనల ఉల్లంఘన మరోసారి చర్చనీయాంశమైంది. దివ్వెల మాధురి, బిగ్‌బాస్ ఫేమ్ తనూజ టీటీడీ (TTD) నిబంధనలను అతిక్రమించి తిరుమల కొండపై పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం వివాదానికి దారితీసింది.
అసలేం జరిగిందంటే?
గురువారం శ్రీవారి దర్శనం కోసం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి దివ్వెల మాధురి, తనూజ తిరుమలకు చేరుకున్నారు. వీరు శ్రీపద్మావతి విచారణ కేంద్రం పరిధిలోని 'శ్రీవిభవ' అతిథి గృహంలో బస చేశారు. అయితే, తనూజ పుట్టినరోజు సందర్భంగా మాధురి బయట నుండి కేక్‌ను తీసుకువచ్చి, నిబంధనలకు విరుద్ధంగా గదుల్లోనే కేక్ కట్ చేయించారు.
సోషల్ మీడియాలో వైరల్:
ఈ వేడుకకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి మాధురి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన చోట ఇటువంటి ప్రైవేట్ వేడుకలు నిర్వహించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల కొండపైకి కేక్ తీసుకురావడం, వేడుకలు జరుపుకోవడం టీటీడీ రూల్స్ ప్రకారం నిషేధం.
దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ జంట వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా శ్రీవారి ఆలయం ముందు వీరు ఫొటోషూట్ నిర్వహించడం పెద్ద దుమారాన్నే రేపింది. తాజా ఘటనపై టీటీడీ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.