Atchannaidu: ప్రతిపక్షం ఉంటేనే సభ రంజుగా ఉంటుంది..!

Atchannaidu: శాసన సభ ప్రస్తుతం సప్పగా ఉందని... ప్రతిపక్షం ఉంటేనే సభ రంజుగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

Update: 2026-03-05 11:50 GMT

Atchannaidu: ప్రతిపక్షం ఉంటేనే సభ రంజుగా ఉంటుంది..!

Atchannaidu: శాసన సభ ప్రస్తుతం సప్పగా ఉందని... ప్రతిపక్షం ఉంటేనే సభ రంజుగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సభకు హాజరుకావాలని వైసీపీని ఆహ్వానిస్తున్నాం... కానీ వారు హాజరు కాకపోతే ఏం చేయాలని అన్నారు. ఒక సభ్యుడు 65రోజులు వరుసగా సభకు హాజరు కాకపోతే అతనిపై చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.

జగన్ మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా జీతం తీసుకోవడం లేదని... మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలందరు శాలరీ తీసుకుంటున్నారని చెప్పారు. వైఎస్సార్‌కు ఉన్న హుందాతనం ఆయన కుమారుడు జగన్‌కు లేదని చెప్పారు. గతంలో రాజకీయ నేతలు ఎంతో ఆప్యాయంగా ఉండేవారని... ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీల పరంగా పూర్తిగా విరోధులు అవుతున్నారని అన్నారు అచ్చెన్నాయుడు.

Tags:    

Similar News