దొంగతనానికి వెళ్లి దొంగ మృతి

Dharmavaram Thief Death: దొంగతనానికి వెళ్లి ఓ దొంగ మృతి చెందిన ఘటన సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.

Update: 2026-03-04 07:17 GMT

దొంగతనానికి వెళ్లి దొంగ మృతి

Dharmavaram Thief Death: దొంగతనానికి వెళ్లి ఓ దొంగ మృతి చెందిన ఘటన సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. ధర్మవరంలోని ఇందిరమ్మ కాలనీలో ముగ్గురు దొంగలు దొంగతనానికి వెళ్లారు. కాలనీవాసులు కేకలు వేయటంతో ఇద్దరు పరారైయ్యారు. నారాయణ అనే మరొక దొంగ తప్పించుకునే ప్రయత్నంలో రైల్వే పట్టాలపై పడిపోయాడు. కాలనీవాసులు అతన్ని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దొంగను ఆస్పత్రకి తరలిస్తుండగా మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News