పట్టు వస్త్రాల కోసం కొట్లాట.. ఎంపీ చిన్ని చేతిలో నుంచి లాక్కున్న కొలికపూడి శ్రీనివాస్!
Nemali Venugopala Swamy Temple: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి శ్రీవేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో వివాదం చోటు చేసుకుంది.
పట్టు వస్త్రాల కోసం కొట్లాట.. ఎంపీ చిన్ని చేతిలో నుంచి లాక్కున్న కొలికపూడి శ్రీనివాస్!
Nemali Venugopala Swamy Temple: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి శ్రీవేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో వివాదం చోటు చేసుకుంది. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దంపతులు హజరయ్యారు. స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాలను ఎంపి కేశినేనికి, ముత్యాల తలంబ్రాలను ఎమ్మెల్యే కొలికపుడి శ్రీనివాస్ కు అందచేశారు ఆలయ కమిటీ అధికారులు.
ఇదే సమయంలోఎంపీ కేశినేని చేతిలో పట్టుకున్న పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే కొలికపూడి బలవంతంగా లాక్కున్నారు. దీంతో ఒక్కసారిగా స్వామివారి కల్యాణమహోత్సవ వేడుకలో ఉద్రిక్త వాతవారణం నెలకొంది. ఎంపీ కేశినేని దంపతులు సామాన్య భక్తుల మధ్యే కల్యాణ పీటలపై కూర్చుకున్నారు. ఏం జరుగుతుందో అర్ధంకాక భక్తులు ఆందోళన చెందారు.